Site icon NTV Telugu

రాహుల్ అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం…కేంద్రంపై పోరుకు సిద్ధం…

రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌త‌న ఈరోజు కీల‌క స‌మావేశం జ‌రిగింది.  ఈ స‌మావేశానికి 14 రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడ‌ర్లు, ఎంపీలు హాజ‌ర‌య్యారు.  కేంద్రంపై ఉమ్మ‌డిపోరును సాగించేందుకు అనుస‌రించాల్సిన వ్యూహం గురించి ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.  ముఖ్యంగా పెగాస‌స్ స్పైవేర్ అంశంపై విప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నారు.  దీంతో పాటుగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ఉమ్మ‌డిగా పార్ల‌మెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి.  బిల్లుల‌పై స‌మ‌గ్రంగా చ‌ర్చించ‌కుండానే ఆమోదించుకోవ‌డంపై కూడా విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. 

Read: సల్మాన్ భాయ్ లాగే నేనూ వర్జిన్… హీరో కామెంట్స్

Exit mobile version