Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Opposition Objects To Portrayal Of Women In Bjps Parody Video On India Bloc

BJP’s parody video: బీజేపీ ‘పెళ్లి చూపులు’ పేరడీ వీడియో.. ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం..

Published Date :March 27, 2024 , 9:48 pm
By Venu Goapl Reddy
BJP’s parody video:  బీజేపీ ‘పెళ్లి చూపులు’ పేరడీ వీడియో.. ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP’s parody video: ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ బీజేపీ చేసిన ఓ వీడియో యాడ్ ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. పెళ్లిచూపులను ఉద్దేశిస్తూ చేసిన ఈ యాడ్‌పై ప్రతిపక్ష కూటమి తీవ్ర అభ్యతరం తెలుపుతోంది. మహిళలను చిన్నచూపు చూసే విధంగా బీజేపీ ప్రకటన ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమాజంలో స్త్రీల విలువలను బీజేపీ తగ్గిస్తోందని మండిపడుతోంది. రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే సహా ప్రతిపక్ష నేతలను యాడ్‌లోని నటులు అనుకరిస్తున్నట్లు ఉంది.

ఓ మహిళ పెళ్లి చూపుల అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ యాడ్‌ని తయారు చేశారు. అయితే, ఇండియా కూటమిలో అనేక మంది లీడర్లు ఉన్న విధంగా, పెళ్లి చూపుల్లో ఎక్కువ మంది వరులు ఉన్నట్లు ఈ యాడ్ చూపిస్తోంది. వరుడు ఎవరనే దానిపై వాదించుకోవడం ఇందులో కనిపిస్తుంది. ఇండియా కూటమిలో కూడా ప్రధాన మంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ జరుగుతున్నట్లు ఈ పేరడీ యాడ్ చూపిస్తోంది.

Read Also: Mood of the Nation: బీజేపీకే జై కొడుతున్న 79 శాతం దేశ ప్రజలు.. తాజా సర్వేలో వెల్లడి..

ఈ ప్రకటన పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే స్పందించారు. పెళ్లి అనేది ఒక పవిత్రమైన కార్యం, ఇది పరస్పర విశ్వాసం, ప్రేమపై ఆధారపడి ఉంటుందని, అయితే బీజేపీ అసభ్యకరంగా దీనిని చిత్రీకరించిందని మండిపడ్డారు. వరుడిని ఎన్నుకోవడానికి, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి చాలా వ్యత్యాసముందని, వరుడు ఎవరైనా కావచ్చు కానీ వైవాహిక ధర్మాన్ని అనుసరించడం ముఖ్యమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. శివసేన(యూబీటీ) నాయకురాలు ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ.. సమాజంలో మహిళల్ని ఎలా చూస్తున్నారనే దానికి బీజేపీ ప్రకటన ఒక ఉదాహరణ అని, ఒక భారతీయ ఓటర్‌ని చూసే పద్ధతి ఇదేనా.? అని ప్రశ్నించారు. ఇది సమాజంలో స్త్రీ పాత్రను తగ్గించడమే అని అన్నారు.

देखिए…

I.N.D.I. अलायंस में Fight,

मैं ही दूल्हा हूं Right. pic.twitter.com/h0kS4dLW3B

— BJP (@BJP4India) March 26, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BJP parody video
  • INDIA Bloc
  • INDIA bloc parody video

తాజావార్తలు

  • Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!

  • AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ టైటిల్ పోస్టర్ వచ్చేసిందిగా..

  • TG High Court: జస్టిస్ పీ.సీ.చంద్రఘోష్ కమిషన్ నివేదిక పై.. తీర్పును ఈ నెల 22 కీ వాయిదా వేసిన హైకోర్టు

  • Bottle Gourd Raita Recipe: ఈ వేసవిలో కూల్‌గా ఉండండి.. ఆరోగ్యకరమైన సొరకాయ రైతా తప్పక ట్రై చేయండి!

  • Sachin-Vaibhav: నాడు సచిన్ vs ఖదీర్.. నేడు వైభవ్ vs బుమ్రా..1989లో భారత్, పాకిస్థాన్ మాచ్ సీన్ రిపీట్..

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions