Parliament winter session: రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..‘‘సర్’’పై ప్రతిపక్షాల పోరు..
- రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..
- ‘‘సర్’’పై పోరుకు ప్రతిపక్షాలు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament winter session: శీతాకాలంలో రాజకీయ వేడిని పుట్టించేలా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తు్న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చకు డిమాండ్ చేశాయి. ఓటర్ జాబితాలో నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. అయితే, దీని వల్ల బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ)లపై తీవ్ర ఒత్తిడి, పనిభారం ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే, సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మరో 7 రోజులు పొడగించింది. ఎన్నికల కమిషన్ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది.
Read Also: Pakistan: పాక్ రాజ్యాంగ సవరణపై యూఎన్ తీవ్ర హెచ్చరిక
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. సమావేశాలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఉంటాయని, 36 పార్టీలు, 50 మంది నాయకులు పాల్గొన్నట్లు చెప్పారు. చాలా మంది ప్రతిపక్ష నేతలు సర్ ప్రక్రియపై చర్చను కోరారని, కానీ పార్లమెంట్ ఎజెండాను నిర్ణయించే అధికారం కేవలం బిజినెస్ అడ్వైజరీ కమిటీకి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం సర్పై చర్చకు అంగీకరించకుంటే, సమావేశాలకు అంతరాయం కలిగించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
అన్ని ప్రతిపక్షాలు సర్పై చర్చకు డిమాండ్ చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. సర్ ప్రక్రియను తొందరపడి పూర్తి చేయవద్దని ప్రతిపక్షాలు పదే పదే హెచ్చరించినప్పటికీ, ప్రభుత్వం తప్పించుకుంటుందని ఆరోపించారు. సర్ ప్రక్రియా ప్రణాళిక ప్రకారం జరగడం లేదని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీఎల్ఓలపై విపరీత ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఎల్ఓలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొత్త ఓట్లను చేర్చడం కన్నా, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తీసేయడంపై ఎక్కువ దృష్టిపెడుతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
CMR Jewellery: గాజువాకలో CMR జువెలరీ షోరూం.. ఘనంగా ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
ట్రెండింగ్
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!