Operation Trishul: పాకిస్తాన్ను భారత్ మరోసారి అదిరిపోయే దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి త్రిశూల్ త్రివిధ దళాల విన్యాసాల నేపథ్యంలో పాకిస్తాన్ తన మధ్య, దక్షిణ వాయు ప్రాంతాల్లో పలు ఎయిర్ ట్రాఫిక్ మార్గాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 28, 29 తేదీలకు సంబంధించి NOTAM (Notice to Airmen) జారీ చేసినప్పటికీ, దాని వెనుక కారణాన్ని ఇస్లామాబాద్ ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇక, భారత ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతంలో భారీ త్రివిధ దళాల విన్యాసాలకు సంబంధించి NOTAM జారీ చేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ఇలాంటి సరిహద్దు సైనిక విన్యాసాల సమయంలో ఇరు దేశాలు NOTAMలు జారీ చేయడం సాధారణం అయింది.
Read Also: Shiva Re-Release: శివ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్‌పై బన్నీ స్పెషల్ మెసేజ్
* త్రిశూల్ విన్యాసాల ప్రాముఖ్యత
త్రిశూల్ విన్యాసాల కోసం కేటాయించిన వైమానిక పరిధి 28,000 అడుగుల ఎత్తు వరకు విస్తరించింది. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత కీలక సంయుక్త సైనిక విన్యాసాల్లో ఒకటిగా చెప్పాలి. ఇక, రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, ఈ విన్యాసాల్లో సైన్యం, నౌకాదళం, వాయుసేన మూడు విభాగాలూ పాల్గొననున్నాయి. ఇది సంయుక్త ఆపరేషనల్ సామర్థ్యాలు, ఆత్మనిర్భర్ భారత్ సూత్రం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించడమే లక్ష్యమని పేర్కొంది. దక్షిణ కమాండ్ దళాలు ఈ విన్యాసాల్లో చురుకుగా పాల్గొంటాయి. క్రీక్ అండ్ ఎడారి ప్రాంతాల్లో దాడి వ్యూహాలు, సౌరాష్ట్ర తీరంలో విన్యాసాలు, బహుముఖ ఆపరేషనల్ వ్యాయామాలు నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
Read Also: Ind vs Aus 3rd ODI: ఆసీస్ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?
* సర్ క్రీక్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం..
ఈ విన్యాసాలు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్-సింధ్-కరాచీ అక్షం ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనిపై ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక చర్యలపై హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సర్ క్రీక్ ప్రాంతంలో దూకుడుగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తే, భారత సైన్యం ఇచ్చే సమాధానం చరిత్రలో గుర్తుండి పోతుందని వార్నింగ్ ఇచ్చారు. కాగా, పాకిస్తాన్ సర్ క్రీక్ ప్రాంతంలో తన సైనిక మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడానికి ప్లాన్ చేస్తుందని ఇటీవల ఇంటెలిజెన్స్ నివేదిక పంపించింది.
