Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌.. పాకిస్తాన్‌కి దెబ్బ, చైనాకు నొప్పి..

China Pak

China Pak

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాకిస్తాన్ మెడలు వంచుతోంది. ఇన్నాళ్లు మేము ప్రపంచంలోనే తోపు ఆర్మీ అని ఫీల్ అవుతున్న పాకిస్తాన్‌ని, అలా నమ్ముతున్న అక్కడి ప్రజలకు నెమ్మదిగా అసలు విషయాలు తెలిసి వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌తో పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది చాలదన్నట్లుగా, బుధవారం-గురువారం రాత్రి సమయంలో భారత్‌పైకి క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడిని మన ‘‘ఎస్-400 సుదర్శన చక్ర’’ సమర్థవంతంగా అడ్డుకుంది.

అయితే, భారత్ దెబ్బ పాకిస్తాన్‌కి పడుతున్నా, నొప్పి మాత్రం చైనాకు కలుగుతోంది. ఎందుకంటే, భారత సైనిక పాటవాల ముందు చైనా రక్షణ వ్యవస్థలు ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నిజానికి చైనా ఉత్పత్తులు అంటేనే చీప్ అనే వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం భారత్ దీనిని నిరూపిస్తోంది. భారత్, పాక్ ఘర్షణలో తాము ఎంత నష్టపోతున్నామనే విషయం చైనాకు తెలిసి వస్తోంది.

Read Also: Operation Sindoor: ఏడవడం ఒక్కటే తక్కువ.. పాకిస్తాన్ పార్లమెంటులో ఎమోషనలైన ఎంపీ.. వీడియో వైరల్!

చైనా ఎయిర్ డిఫెన్స్, క్షిపణులు ధ్వంసం:

ముఖ్యంగా, చైనా తయారీ వ్యవస్థలు భారత్ దాడుల ముందు పనిచేయడం లేదు. చైనా తయారు చేసిన పాకిస్తాన్ HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థలు దాడుల సమయంలో అస్సలు పసిగట్టలేకపోయాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పీఓకే, పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లో 9 స్థావరాల్లో 24 దాడులు నిర్వహిస్తే ఒక్క క్షిపణిని కూడా గుర్తించి, అడ్డుకోలేకపోయింది.

ఇక, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్‌లోని 15 నగరాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ దాడుల్ని ఎస్-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుంది. ఈ దాడిలో పాక్ ఉపయోగించినవి చైనా మిస్సైల్స్ అని తేలింది. గురువారం ఉదయం భారత్ ఏకంగా లాహోర్‌లోని HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థని భారత్ ఇజ్రాయిల్ తయారీ క్షిపణులు ధ్వంసం చేశాయి.

ఈ పరిణామాలు చైనాకు మింగుడు పడటం లేదు. భారత దాడితో చైనా ఆయుధాల పనితీరును ప్రపంచానికి బహిర్గతం అయింది. రానున్న రోజుల్లో చైనా మిలిటరీ పరికరాలు, ఆయుధాలను పాకిస్తాన్ మినహా ఏ దేశం కూడా కొనే పరిస్థితి ఉండదు. ఇదిలా ఉంటే, భారత్ తన ఆకాష్ మిస్సైల్‌తో చైనా తయారీ జేఎఫ్ 17 యుద్ధ విమానాన్ని మన ఆకాష్ మిస్సైల్ కూల్చేసిందని తెలుస్తోంది. అయితే, దీనిపై పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన చేయకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఇది తెగ వైరల్ అవుతోంది.

Exit mobile version