Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blood Donation Camp: ప్రతి మనిషి శరీరంలో ప్రవహించేది రక్తమే.. ఎవరిని కోసినా రక్తమే వస్తుంది.. దానికి కులం, మతం, ప్రాంతం అనే తేడా లేదు.. కొన్ని గ్రూపులు ఉండొచ్చు.. కానీ, కులాలు, మతాలు అనే తేడా లేకుండా అందరిలోనూ అవే గ్రూప్‌లు ఉంటాయి.. అలాంటి రక్తాన్నే కులాల వారీగా విభజించే ప్రయత్నం వివాదానికి దారితీసింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో రక్తదాన శిబిరంలో కులం వివరాలు సేకరించడం కలకలం రేపింది.
ఊటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో.. దాతల వివరాలు నమోదు చేసే ఫారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ అంటూ ప్రత్యేక కాలమ్‌లు కనిపించాయి. దీనిపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫారాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం చర్చనీయాంశంగా మారింది. రక్తదాన శిబిరానికి సహకరించిన ‘మేరా యువ భారత్’ నీలగిరి జిల్లా ఆర్గనైజర్ ఎస్. రంజిత్ కుమార్ ఆధ్వర్యంలోనే కుల వివరాలు సేకరించినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై కళాశాల ప్రిన్సిపాల్ జె. ఎబినేజర్ నీలగిరి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాలకు చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించిన రంజిత్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉండగా.. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది..
Also Read
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?