NTV Telugu Site icon

Delhi: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Pmmodi

Pmmodi

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. కేంద్రమంత్రులు కూడా ప్రకటనలు చేశారు. అన్నట్టుగానే బుధవారం మోడీ నేతృత్వంలోని మంత్రివర్గం కోవింద్ నివేదికకు ఆమోదముద్ర వేసింది.

ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఇటీవలే కాంగ్రెస్, వామపక్షాలు స్పష్టం చేశాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని.. అందుకు లోక్‌సభలోనూ.. రాజ్యసభలోనూ మోడీ ప్రభుత్వానికి బలం లేదని స్పష్టంచేశాయి. కానీ కేంద్రం మాత్రం జమిలి వైపే మొగ్గుచూపుతోంది. దీనిపై విపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.