Site icon NTV Telugu

Jamili Election Bill: జాయింట్ పార్లమెంటరీ కమిటీకి జమిలి ఎన్నికల బిల్లు..

Jamili

Jamili

Jamili Election Bill: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు తీసుకు వచ్చిన 129వ రాజ్యాంగ సవరణ (వన్ నేషన్- వన్ ఎలక్షన్) బిల్లును ఈరోజు (డిసెంబర్ 20) లోక్‌సభ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. అయితే, మంగళవారం నాడు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశ పెట్టింది. దాంతో ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని.. వెంటనే, దీన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఇక, అధికారపక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి కట్టుబడే ఉందని చెప్పుకొచ్చింది. కాగా, అన్ని పార్టీలు దీనిపై విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపడానికి తమకేమీ అభ్యంతరం లేదని మోడీ సర్కార్ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇవాళ జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లును పంపింది.

Read Also: West Indies vs Bangladesh: సొంతగడ్డలో వెస్టిండీస్‌కు ఘోర అవమానం.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్

అయితే, స్పీకర్ ఓం బిర్లా ఈరోజు లోక్‌సభ, రాజ్యసభ రెండింటికి చెందిన 39 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి జమిలి ఎన్నికల బిల్లును పంపించారు. ఇక, జేపీసీ కమిటీలో 27 మంది లోక్‌సభ, 12 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఈ బిల్లును తిరిగి లోక్‌సభ స్పీకర్‌కు పంపుతుంది.

Exit mobile version