NTV Telugu Site icon

One Nation One Election Bill Live UPDATES: లోక్‌సభలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై చర్చ లైవ్ అప్డేట్స్

Eletions

Eletions

One Nation One Election Bill Live UPDATES: లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ (129) సవరణ బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ లోక్‌సభలో ప్రవేశ పెట్టగా.. ఈ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, ఎంఐఎం, టీఎంసీ పార్టీలు వ్యతిరేకించాయి. కాగా, ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటికి పంపాలని స్పీకర్ ను కేంద్రమంత్రి కోరారు. పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను ఈ సంఘంలో నియమించనున్నారు. లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లుపై లైవ్ అప్ డేట్స్ మీ కోసం..

The liveblog has ended.
  • 17 Dec 2024 06:52 PM (IST)

    లోక్‌సభకు 20 మంది బీజేపీ సభ్యులు గైర్హాజరు..

    ఇవాళ లోక్‌సభకు 20 మంది బీజేపీ సభ్యులు గైర్హాజరు
    జమిలి బిల్లు కోసం అధిష్టానం విప్ జారీ చేసినా..,
    లోక్‌సభకు హాజరుకాని 20 మంది బీజేపీ ఎంపీలు
    గైర్హాజరైన సభ్యులకు నోటీసులు జారీ చేయనున్న బీజేపీ హైకమాండ్

  • 17 Dec 2024 06:49 PM (IST)

    ప్రపంచంలోనే అత్యంత వివరణాత్మక రాజ్యాంగం మనదే- అమిత్ షా..

    ప్రపంచంలోనే అత్యంత వివరణాత్మక, లిఖితపూర్వక రాజ్యాంగం మనదేనని రాజ్యసభలో అమిత్ షా అన్నారు.

  • 17 Dec 2024 06:47 PM (IST)

    రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ

    రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు.

  • 17 Dec 2024 06:46 PM (IST)

    లోక్‌సభ రేపటికి వాయిదా..

    లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

  • 17 Dec 2024 05:21 PM (IST)

    తయారీ రంగంలో మందగమనం లేదు- నిర్మలా సీతారామన్

    లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తయారీ రంగంలో సాధారణ మందగమనం లేదని, సగం తయారీ రంగం ఇప్పటికీ బలమైన వృద్ధిని చూపుతోందన్నారు. ఏప్రిల్-అక్టోబర్ 2024-25లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8 శాతానికి కనిష్టంగా ఉందని తెలిపారు. ఎన్డీఏ పాలనలో ద్రవ్యోల్బణం బాగా నియంత్రించామని.. యూపీఏ హయాంలో రెండంకెల స్థాయికి చేరుకుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

  • 17 Dec 2024 04:55 PM (IST)

    'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' బిల్లును జేపీసీకి పంపడానికి ప్రధాని మద్ధతు ఇచ్చారు..

    'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' బిల్లుపై ప్రతి స్థాయిలోనూ సవివరంగా చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా ఉన్నారని, దానిని పార్లమెంట్‌ సంయుక్త కమిటీకి పంపాలని అమిత్‌ షా అన్నారు. రాజ్యాంగం (129వ సవరణ) బిల్లును ప్రవేశపెట్టడంపై సభలో అభ్యంతరాలు వినిపిస్తున్న సందర్భంగా లోక్‌సభలో షా ఈ వ్యాఖ్య చేశారు.

  • 17 Dec 2024 04:51 PM (IST)

    వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు సభలో విఫలమైంది - కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్

    వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు సభలో విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. తమకు సంఖ్యాబలం లేనందున పూర్తిగా విఫలమైందని.. మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తెలిపారు.

  • 17 Dec 2024 04:02 PM (IST)

    ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం- ప్రియాంక గాంధీ

    వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. ఇది మన దేశ ఫెడరలిజానికి విరుద్ధమని ప్రియాంక గాంధీ అన్నారు. బిల్లును వ్యతిరేకిస్తూనే ఉంటామని తెలిపారు.

  • 17 Dec 2024 03:16 PM (IST)

    జమిలి ఎన్నికల కోసం 2 బిల్లులు..

    జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రాజ్యాంగ సవరణ బిల్లు
    జమిలి ఎన్నికల కోసం 2 బిల్లులు పెట్టిన కేంద్రం
    రాజ్యాంగ సవరణను వ్యతిరేకించిన విపక్షాలు
    జేపీసీకి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు

  • 17 Dec 2024 02:17 PM (IST)

    కాసేపట్లో జేసీపీ సభ్యులు

    కాసేపట్లో జేపీసీ సభ్యుల ప్రకటన

  • 17 Dec 2024 02:17 PM (IST)

    జేపీసీకి మద్దతు, వ్యతిరేకంచిన ఇచ్చిన పార్టీలు ఇవే..

    జమిలి ఎన్నికల బిల్లును సమర్దించిన బీజేపీ, టీడీపీ, వైసీపీ, జేడీయూ, అప్నాదళ్ మద్దుతు ఇవ్వగా.. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ముస్లిం లీగ్ పార్టీ, ఎంఐఎం, ఎన్సీపీ(ఎస్పీ),

  • 17 Dec 2024 01:58 PM (IST)

    జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు..

    లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ఓటింగ్ ను క్రాస్ చెక్ చేసిన స్పీకర్.. బిల్లును జేపీసీకి పంపడానికి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు.. జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు..

  • 17 Dec 2024 01:55 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ వాయిదా

    లోక్‌సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసిన స్పీకర్ ఓంబిర్లా..

  • 17 Dec 2024 01:40 PM (IST)

    డౌట్ ఉంటే ఓటింగ్ స్లిప్స్ ద్వారా కూడా ఓటు వేయండి: స్పీకర్

    జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు పంపడంపై ఓటింగ్.. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్.. జమిలి బిల్లును జేపీసీకి పంపడానికి అనుకూలంగా ఓటేసిన 220 మంది, వ్యతిరేకంగా 149 ఓట్లు.. ఎలక్ట్రానిక్ విధానంపై అనుమానం ఉన్న వారికి ఓటింగ్ స్లిప్స్ ద్వారా కూడా ఓటింగ్ కు అనుమతించిన స్పీకర్ ఓంబిర్లా..

  • 17 Dec 2024 01:31 PM (IST)

    జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లును పంపడానికి అనుమతి..

    జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపడానికి అనుమతి.. జమిలి బిల్లుకు అనుకూలంగా 220 సభ్యుల మద్దతు, వ్యతిరేకంగా 149 మంది.. సాధారణ మెజార్టీతో బిల్లుకు అనుమతి.. ఓటింగ్ ను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించిన స్పీకర్..

  • 17 Dec 2024 01:17 PM (IST)

    జేపీసీకి బిల్లు పంపడంపై ఓటింగ్

    జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు పంపడంపై ఓటింగ్.. జేపీసీకి పంపడంపై డివిజన్ కోరిన విపక్షాలు.. ఓటింగ్ కు అనుమతించిన స్పీకర్ ఓంబిర్లా.. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్..

  • 17 Dec 2024 01:13 PM (IST)

    విపక్షాల అభ్యంతరాలపై కేంద్రమంత్రి సమాధానం..

    విపక్షాల అభ్యంతరాలపై సమాధానం ఇచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్.. కేంద్రం.. సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకంగా పని చేయడం లేదు.. జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు పంపడానికి మేము సిద్ధం.. చట్ట సభల కాలపరిమితిపై నిర్ణయం తీసుకునే విధానం.. రాజ్యాంగం ద్వారా పార్లమెంట్ కి సంక్రమించింది-అర్జున్ రామ్ మేఘ్ వాల్

  • 17 Dec 2024 01:09 PM (IST)

    బిల్లుపై సమగ్ర చర్చ ఉంటుంది..

    జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ పరిశీలనకు పంపినప్పుడు సమగ్ర చర్చ జరుగుతుంది.. బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు మళ్లీ సమగ్ర చర్చ ఉంటుంది: స్పీకర్ ఓంబిర్లా

  • 17 Dec 2024 12:56 PM (IST)

    ఈ బిల్లును జేపీసీకి పంపాలని ప్రధాని చెప్పారు..

    జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు.. ఈ బిల్లును జేపీసీకి పంపి.. విస్తృత చర్చ జరగాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.. సంయూక్త పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక తర్వాత మళ్లీ బిల్లు తీసుకొస్తాం.. జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు పంపడానికి మేము సిద్ధం: అమిత్ షా

  • 17 Dec 2024 12:53 PM (IST)

    ఈ బిల్లుతో ప్రాంతీయ పార్టీలు తుడిచి పెట్టుకుపోతాయి..

    అధ్యక్ష తరహా ఎన్నికలు తీసుకురావడంలో భాగమే ఈ జమిలి ఎన్నికల బిల్లు.. ఈ బిల్లు ప్రాంతీయ పార్టీలను తుడిచి పెట్టేస్తుంది: అసదుద్దీన్ ఒవైసీ..

  • 17 Dec 2024 12:48 PM (IST)

    మెజార్టీ లేనప్పుడు బిల్లును ఎలా పెడతారు..

    జమిలి ఎన్నికల ఆమోదానికి అవసరమైన 2/3 మెజార్టీ లేనప్పుడు బిల్లును ఎలా పెడతారు: డీఎంకే

  • 17 Dec 2024 12:47 PM (IST)

    ఈసీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయిస్తారు..

    ఈ జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే.. ఈసీకి సర్వాధికారాలు వస్తాయి.. ఇక, ఈసీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు.. తరుణ్ గొగొయ్..

  • 17 Dec 2024 12:40 PM (IST)

    ఈ బిల్లు ప్రజాస్వామ్యంపై దాడి: ముస్లిం లీగ్

    జమిలి ఎన్నికల బిల్లుపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన వివిధ పార్టీలు.. ఈ బిల్లులు ప్రవేశ పెట్టటం అంటేనే ప్రజాస్వామ్యంపై దాడి: ముస్లిం లీగ్ మహ్మద్ బషీర్

  • 17 Dec 2024 12:37 PM (IST)

    ఈ బిల్లును సభలోకి ఎలా పర్మిషన్ ఇచ్చారు..

    అసంబద్ధమైన ఈ బిల్లులను సభలో ఎలా అనుమతించారు: డీఎంకే టీఆర్ బాలు..

  • 17 Dec 2024 12:35 PM (IST)

    డా. బీఆర్ అంబేద్కర్ కంటే మేధావి ఎవరు లేరు..

    డా. బీఆర్ అంబేద్కర్ కంటే మేధావి, వివేకవంతులు.. ఈ సభలో లేరని చెప్పేందుకు ఏ మాత్రం సంకోచించను.. రాజ్యాంగ స్ఫూర్థిని కాలరాసేలా బీజేపీ ఉద్ధేశం కనిపిస్తుంది: ధర్మేంద్ర యాదవ్

  • 17 Dec 2024 12:33 PM (IST)

    ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీయడమే బీజేపీ అజెండా..

    రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసేలా బీజేపీ చర్యలు.. ఫెడరల్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని, మేధోమధనం చేసి రాజ్యాంగాన్ని రూపొందించారు.. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీయడమే- టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ

  • 17 Dec 2024 12:31 PM (IST)

    జమిలి బిల్లుకు ఇండియా బ్లాక్ సెగ

    జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే.. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్..

  • 17 Dec 2024 12:28 PM (IST)

    ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి: కాంగ్రెస్

    2 బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్.. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలు ఇవి.. ఇది ఎన్నికల సంస్కరణ కాదు.. ఒక నేత లక్ష్యాన్ని నెరవేర్చడమే: ఇండియా కూటమి

  • 17 Dec 2024 12:23 PM (IST)

    ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం..

    రాష్ట్రాల అసెంబ్లీల కాల వ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ

  • 17 Dec 2024 12:21 PM (IST)

    జమిలి బిల్లు వ్యతిరేకంగా ఎస్పీ

    లోక్ సభలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకించిన సమాజ్ వాది పార్టీ..

  • 17 Dec 2024 12:19 PM (IST)

    జమిలి బిల్లుకు కావాల్సిన మెజార్టీ

    జమిలి బిల్లు లోక్ సభలో గట్టెక్కాలంటే (542) 2/3 మెజార్టీ అవసరం.. ఎన్డీయే బలం- 293, ఇండియా కూటమి బలం-234, జమిలి బిల్లు పాస్ కావాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం..

  • 17 Dec 2024 12:15 PM (IST)

    జమిలి బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్..

    జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్..

  • 17 Dec 2024 12:12 PM (IST)

    లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..

    లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ..

  • 17 Dec 2024 12:10 PM (IST)

    కాసేపట్లో లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..

    కాసేపట్లో లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న న్యాయశాఖ మంత్రి.. వెంటనే సంయుక్త పార్లమెంటరీ స్థాయీ సంఘానికి బిల్లు.. తమ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. బీజేపీకి దక్కనున్న స్థాయీ సంఘం ఛైర్మన్ పదవి.. సాయంత్రంలోపే జేపీసీ సభ్యుల ప్రకటన..

  • 17 Dec 2024 12:07 PM (IST)

    కాంగ్రెస్ పై కేంద్రమంత్రి ఫైర్

    కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని విమర్శించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు

  • 17 Dec 2024 12:01 PM (IST)

    వన్ నేషన- వన్ ఎలక్షన్ బిల్లుకు టీడీపీ, వైసీపీ మద్దతు..

    జమిలి ఎన్నికలతో ఎలాంటి ఇబ్బందులు లేవని వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి తెలిపారు.. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచిదని టీడీపీ ఎంపీలు అంటున్నారు.

  • 17 Dec 2024 11:45 AM (IST)

    రాష్ట్రపతి పాలనను తీసుకురావడమే బీజేపీ అంతిమ లక్ష్యం..

    వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై తమిళనాడు సీఎం హాట్ కామెంట్స్.. రాష్ట్రపతి పాలనను తీసుకురావడమే బీజేపీ అంతిమ లక్ష్యం.. ఈ బిల్లులు ఆమోదం పొందితే, రాష్ట్రాలకు కాలానుగుణంగా ఎన్నికలు నిర్వహించే విధానాన్ని తొలగించబడుతుంది.. ఈ బిల్లు వల్ల ప్రాంతీయ భావాలు దెబ్బతింటాయి: సీఎం స్టాలిన్

  • 17 Dec 2024 11:28 AM (IST)

    బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోంది: ఎంపీ ప్రియాంక చతుర్వేది

    వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది.. బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోంది.. ఇది ఎన్నికల ప్రక్రియను తారుమారు చేసే అవకాశం ఉంది.. అధికారాన్ని కేంద్రీకరించాలని బీజేపీ చూస్తుంది.. జమిలి ఎన్నికలు ఎంత ఖర్చుతో కూడుకున్నది- ఎంపీ ప్రియాంక చతుర్వేది

  • 17 Dec 2024 11:25 AM (IST)

    జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగ విరుద్ధం..

    వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ విరుద్దం.. కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోంది- జైరాం రమేష్‌

  • 17 Dec 2024 11:10 AM (IST)

    వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లు పాస్ అవుతంది..

    జమిలి ఎన్నికల బిల్లు లోక్ సభ ముందుకు రానుంది.. ప్రజల ఆకాంక్షలను అమలు చేయడమే మోడీ సర్కార్ లక్ష్యం.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూస్తాం.. కచ్చితంగా ఈ బిల్లు పాస్ అవుతుంది.. దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయి- ఎంపీ రాఘునందన్ రావు

  • 17 Dec 2024 11:07 AM (IST)

    బిల్లుకు వైసీపీ మద్దతు..

    వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుకు వైసీపీ మద్దతు..

  • 17 Dec 2024 11:06 AM (IST)

    జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్

    వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్.. లోక్ సభలో నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ..