NTV Telugu Site icon

One Nation One Election: జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు పంపడంపై లోక్‌సభలో ఓటింగ్..

Lok

Lok

One Nation One Election: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల జరిగేలా ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్ ’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకొచ్చింది. దీని కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, మరో బిల్లును కేంద్ర కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ రోజు (డిసెంబర్ 17) లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత దీనిపై చర్చ జరిగింది.. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, ఎంఐఎం, డీఎంకే సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే, ఎన్డీయే మిత్ర పక్షాలు ఈ బిల్లులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఆ తర్వాత దీనిపై స్పీకర్ ఓంబిర్లా ఓటింగ్‌కు నిర్వహించారు.’

Read Also: Thiru Manickam : క్రిస్మస్ కానుకగా సముద్రఖని సినిమా రిలీజ్

అయితే, జమిలి బిల్లును ప్రవేశ పెడుతూ కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్‌సభలో ఓటింగ్‌ జరిగింది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో దీన్ని చేపట్టారు. ఇందులో కొంత మంది హైబ్రిడ్ పద్ధతిలో ఓటు వేయగా.. మరి కొంత మంది పార్లమెంట్ సభ్యులు బ్యాలెట్‌ విధానంలో తమ అభిప్రాయాలను తెలిపారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో 467 మంది వినియోగించుకోగా.. ఇందులో 269 మంది బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనుకూలంగా ఓటు వేయగా.. 198 మంది వ్యతిరేకించారు. అనంతరం లోక్ సభను మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. కాసేపట్లో జేపీసీ సభ్యుల పేర్లను ప్రకటించనున్నారు.