NTV Telugu Site icon

Mamata Banerjee: రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంః మమత బెనర్జీ

Mamatha

Mamatha

Mamata Banerjee: |ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన పశ్చిమబెంగాల్‌ వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఘోర ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారి బంధువులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి ప్రస్తుతం మానసిక మరియు శారీరక గాయాలతో బాధపడుతున్న వారికి తమ ప్రభుత్వం నగదు సహాయం చేస్తుందని మమత తెలిపారు. ప్రమాదంలో గాయపడి భువనేశ్వర్‌ మరియు కటక్‌ నగరాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మమతా బెనర్జీ మంగళవారం పరామర్శించనున్నారు.

Add also: Malware: మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే డేంజర్.. మీ రికార్డులన్నీ బట్టబయలే

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 206 మంది ప్రయాణికులు గాయపడి ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆమె చెప్పారు. కటక్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 33 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మంగళవారం తనతోపాటు కొంతమంది రాష్ట్ర మంత్రులు మరియు సీనియర్ అధికారులు వస్తారని ఆమె చెప్పారు. బాధితుల బంధువులకు ఎక్స్‌గ్రేషియా చెక్కులతోపాటు.. ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్‌లను మమతా బెనర్జీ బుధవారం పంపిణీ చేయనున్నారు.

Add also: Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు

ప్రమాదంపై తాను ఎలాంటి రాజకీయాలను చేయబోనని.. గాయపడిన ప్రయాణికులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైలు ప్రమాదంలో గాయపడిన తమ రాష్ట్రానికి చెందిన ప్రయాణీకుల చికిత్స మరియు పునరావాసాన్ని పర్యవేక్షించడానికి మంగళవారం వెళ్లాలలని నిర్ణయించిన నేపథ్యంలో .. తన నాలుగు రోజుల డార్జిలింగ్‌ పర్యటనను రద్దు చేసుకున్నారని బెంగాల్ సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు సీఎం మమత హిల్స్‌లోని అన్ని రాజకీయ పార్టీల సభ్యులను కలవాల్సి ఉందని సచివాలయ వర్గాలు తెలిపాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మమతా బెనర్జీ డార్జిలింగ్‌ పర్యటనను కొనసాగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.