NTV Telugu Site icon

Mumbai: సైకిల్‌తో యువకుడు స్టంట్.. చివరికి ఏమైందంటే..! వీడియో వైరల్

Cycle

Cycle

అతి వేగం ప్రమాదకరం. నిదానమే ప్రదానం. నెమ్మదిగా వెళ్లండి.. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్ ధరించండి ప్రాణాలు రక్షించుకోండి. ఇలాంటి హెచ్చరిక బోర్డులు రోడ్లపై నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. మన కంటపడుతుంటాయి.. నిత్యం చదువుతూనే ఉంటాం. అయినా కూడా కొందరు నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకొని కన్నవారికి విషాదాన్ని కలిపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో చోటుచేసుకుంది. నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది.

నీరజ్ యాదవ్ (16) అనే బాలుడు ముంబై సమీపంలోని మీరా-భయందర్‌లోని సైకిల్ వేగంగా దూసుకుపోతున్నాడు. ఘోడ్‌బందర్ కోటకు సైకిల్‌పై వెళ్తున్నాడు. అత్యంత వేగంగా సైకిల్ నడుపుతున్నాడు. అయితే రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఒక్కసారి సైకిల్ అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. ఆ స్పీడ్‌లో తల గోడకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలో ఉన్న ఇద్దరు యువకులు రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఘటన జరిగినప్పుడే ప్రాణాలు వదిలేశాడు. సమీప నివాసంలో ఉన్నవారంతా వచ్చి సాయం చేసే ప్రయత్నించినా ఏం ఉపయోగం లేకుండాపోయింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే సమీపంలో ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆస్పత్రికి తీసుకెళ్లగానే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదవశాత్తు మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Show comments