NTV Telugu Site icon

Omar Abdullah: జమ్మూకాశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా! ఎన్సీ కూటమి చర్చలు

Congressnc

Congressnc

జమ్మూకాశ్మీర్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని.. హంగ్ ఏర్పడడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయి. కానీ ఈవీఎంల ఫలితాలు వచ్చేటప్పటికీ అంచాలన్నీ తలకిందులయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారం దిశగా దూసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పాటకు కావాల్సిన సీట్లను సొంతం చేసుకుంది. దీంతో జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీ కూటమి అధికారం ఛేజిక్కించుకోవడం ఖాయమైంది. ఇప్పుడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతారని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఇండియా కూటమి నిరంతరం పోరాడుతుందని ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Nagarjuna : మంత్రి అసభ్యంగా మాట్లాడారు..క్రిమినల్ చర్యలు తీసుకోవాలి!

దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మూడు దశల్లో పోలింగ్ జరిగింది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఓటింగ్ జరిగింది. ఈనెల 5న విడుదలైన ఎగ్జిట్స్ పోల్స్‌లో ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాదని తేల్చాయి. కానీ అంచాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎన్సీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాగింది. దీంతో కూమిటి అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 41 స్థానాలతో దూసుకెళ్తోంది. బీజేపీ 29 స్థానాలకు పరిమితమైంది. పీడీపీ 4, కాంగ్రెస్‌ 5, ఇతరులు 11 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం.

ఇది కూడా చదవండి: CM Chandrababu: కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ

Show comments