Site icon NTV Telugu

Omar Abdullah: కొందరు చేసిన ఉగ్రదాడికి మొత్తం కాశ్మీరీలకు అవమానాలు..

Omarabdullah

Omarabdullah

Omar Abdullah: కొంత మంది చేసిన ఉగ్రవాద చర్యలు కాశ్మీర్ లోయలోని నివాసితులందర్ని కించపరుస్తున్నాయని, అందరూ అనుమానిస్తున్నారని, కాశ్మీర్ నుంచి బయటకు వెళ్లిన వారితో మాట్లాడేందుకు ప్రజలు దూరంగా ఉంటున్నారని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్‌‌కు పాల్పడిన ఉగ్రవాదుల్లో చాలా మంది జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వారే. వైద్యులుగా ఉంటూ ఉగ్రవాదానికి పాల్పడ్డారు. 2019లో ఉగ్రవాదం అంతా ఆగిపోతుందని చెప్పింది, కానీ జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత కూడా ఏమీ జరగలేదని ఆయన అన్నారు.

Read Also: Supreme Court: “ఆస్తి వివాదాల”పై హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన..

ప్రస్తుత పరిస్థితిని చూస్తే, ఎవరూ తమ పిల్లల్ని కాశ్మీర్ నుంచి బయటకు పంపాలని అనుకోరని, ప్రతీచోట ప్రజలు మమ్మల్ని అవమానిస్తున్నారని, కాశ్మీరీలను దూషిస్తున్నారని ఒమర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఘటనకు కొంత మంది బాధ్యులు, కానీ కాశ్మీరీలందర్ని బాధ్యులుగా చేసే వాతావరణం ఏర్పడిందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాన్ని నడపడం నేరంగా భావిస్తున్నారు.

Exit mobile version