Site icon NTV Telugu

Manu Bhaker: ష్యాషన్ షోలో అదరగొట్టిన మను భాకర్.. ర్యాంప్‌పై వయ్యారం

Manubhaker

Manubhaker

మను భాకర్ పరిచయం అక్కర్లేని పేరు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత భారతీయులకు మను భాకర్ సుపరిచితురాలే. స్టార్ షూటర్‌గా ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించింది. దీంతో ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? మను భాకర్ షూటర్‌గానే కాకుండా ఫ్యాషన్ షోలో కూడా తన వయ్యారాలతో అలరించింది. క్యూట్ వాక్‌తో చూపరులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి:Director: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని రేప్ చేశాడు.. డైరెక్టర్ పై కేసు నమోదు!

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం అందాల భామలతో లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముద్దుగుమ్మలు ర్యాంపుపై తమ హొయలను ఒలికించారు. ఈ కార్యక్రమంలో మను భాకర్ కూడా పాల్గొని తన వయ్యారాలతో మరిపించారు. భారీ సంఖ్యలో ఫ్యాషన్ షోకు వచ్చిన అతిథుల మధ్య మను భాకర్‌ ర్యాంప్‌ వాక్‌ చేసింది. అయితే ఆమె ముఖంలో చిరునవ్వులు కొదవయ్యాయి. కొంచెం ఇబ్బందికరంగా ఫీలైనట్లుగా కనిపించింది. ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. దీంతో ఆమె ఏదో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించింది. ర్యాంప్‌ వాక్‌ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందరి మధ్య ర్యాంప్‌పై నడవం అనేది తనకు ఇబ్బందికరంగా అనిపించిందని, దీంతో కొంత నిరుత్సాహానికి గురైనట్లు చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Stock market: మళ్లీ ఒడిదుడుకులు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Exit mobile version