Inter-Caste Marriage: కులాంతర వివాహం.. 40 మందికి గుండు గీయించిన గ్రామ పెద్దలు..
- ఎస్సీ అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకున్న ఆదివాసీ అమ్మాయి..
- యువతి కుటుంబంలోని 40 మందికి గుండు గీయించిన గ్రామ పెద్దలు..
- పెళ్లి చేసుకున్న కొత్త జంటకు పెద్దకర్మ చేసి.. జంతబలి ఇచ్చిన గ్రామస్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter-Caste Marriage: మరో కులం వ్యక్తిని యువతి లవ్ మ్యారేజ్ చేసుకోగా.. ఊరి నుంచి వెలివేతను తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు 40 మంది గుండు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన అమానవీయ ఘటన ఒడిశాలో జరిగింది. అయితే, వివరాల్లోకి వెళితే.. రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో చోటు చేసుకుంది. స్థానిక గోరఖ్‌పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ అమ్మాయి, షెడ్యూల్డ్ కులానికి చెందిన అబ్బాయినీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, యువతి తరఫు వారు ఈ వివాహానికి అంగీకరించక పోవడంతో ఇద్దరూ మూడు రోజుల క్రితం లేచిపోయి పెళ్లి చేసేసుకున్నారు.
Read Also: Iran-Israel War: అట్టుడుకుతున్న పశ్చిమాసియా.. శక్తివంతమైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మృతి
Also Read
అయితే, గురువారం నాడు వచ్చిన లేచిపోయి పెళ్లి చేసుకున్న జంట గ్రామానికి రావడంతో విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి ఫ్యామిలీ సభ్యులను గ్రామ బహిష్కరణ చేశారు. దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా గుండు చేసుకుని, మూగ జీవాలను బలిచ్చి, కొత్త జంటకు పెద్ద కర్మ చేయాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. దీంతో యువతి తరపు కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో 40 మంది పురుషులు గుండు చేయించుకుని మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, ఆ కొత్తకు పెద్దకర్మ కూడా చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులను ప్రశ్నించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలియజేశారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..