కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన కేంద్రం.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ విషయంలో బాధ్యత రాష్ట్రాలకే వదిలేసింది.. అయితే, కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలనే డిమాండ్ రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది.. ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వినిపించగా.. ఇవాళ వారికి ఒడిషా తోడైంది.. కేంద్రమే వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని కోరారు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్… దీనిపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలంటూ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖరాశారు నవీన్ పట్నాయక్.. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యత ఇచ్చి యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరారు.. వ్యాక్సిన్ తోనే కోవిడ్ కట్టడి సాధ్యమవుతుందన్నారు ఒడిశా సీఎం.. కరోనా సమయంలో.. వ్యాక్సిన్ల సేకరణ కోసం పోటీ పడుతూ రాష్ట్రాల మధ్య పోరుకు ఇది వేదిక కారాదని పేర్కొన్నారు..
రాష్ట్రాలకు కేంద్రమే వ్యాక్సిన్లు ఇవ్వాలి.. అందరు సీఎంలు అడగండి..!
Naveen Patnaik