Site icon NTV Telugu

Presidential Polls: ఒడిశా సీఎం కీలక ప్రకటన.. మద్దతుపై తేల్చేశారు..

Naveen Patnaik

Naveen Patnaik

రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికి? అనే విషయంపై తేల్చేశారు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌.. ఆయన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ముకు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.. సోషల్‌ మీడియాలో వేదికగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నవీన్‌ పట్నాయక్‌.. తమ రాష్ట్రానికి చెందిన శ్రీమతి ద్రౌపది ముర్మును దేశ అత్యున్నత పదవికి ఎన్నుకోవడానికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు.. ఒడిశా శాసనసభ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు.. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలందరినీ కోరారు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌. మరోవైపు, విపక్షాలు బరిలోకి దింపిన యశ్వంత్‌ సిన్హాకు దేశవ్యాప్తంగా 22 పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read Also: Maharashtra Political Crisis: ఉద్ధవ్‌ థాక్రే రాజీనామా..?

కాగా, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్నికలకు ఒడిశా గిరిజన నేత ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించింది.. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి.. బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత 64 ఏళ్ల ముర్ము, జార్ఖండ్ మాజీ గవర్నర్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. అత్యున్నత రాజ్యాంగ పదవిని ఆక్రమించిన మొదటి గిరిజన మహిళగా రికార్డు సృష్టించనున్నారు.. ఇక, ద్రౌపది ముర్ము తనను ఎంపిక చేసిన విషయాన్ని టీవీలో తెలుసుకుని ఆశ్చర్యపోయారు.. మీడియాతో మాట్లాడిన ద్రౌపది ముర్ము.. తానను ఎన్డీఏ అత్యున్నత పదవికి నామినేట్‌ చేసిన విషయాన్ని టీవీలో చూసి ఆశ్చర్యపోయాయన్నారు.. ఆశ్చర్యంతో పాటు ఆనందంగా ఉన్నాను.. మారుమూల మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ అయిన నేను అత్యున్నత పదవికి అభ్యర్థి కావాలని అనుకోలేదని రాయ్‌రంగ్‌పూర్ తన నివాసంలో మీడియాతో వ్యాఖ్యానించారు.

Exit mobile version