NTV Telugu Site icon

Rajasthan: రాజస్థాన్ మంత్రి బూతుపురాణం.. మహిళతో అసభ్యకరమైన వీడియో

Rajasthan Minister Video

Rajasthan Minister Video

Objectionable Video Of Rajasthan Minister Goes Viral, BJP Demands Sacking: రాజస్థాన్ మంత్రి బూతు వీడియో ఒకటి వైరల్ గా మారింది. బాధ్యయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యకరంగా వీడియోకాల్ లో మాట్లాడుతున్న వీడియో వైరల్ కావడం ప్రకంపనలు రేపుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రి వర్గంలో ఉన్న మైనారిటీ వ్యవహారాల మంత్రి సలేహ్ మహ్మద్ ఈ వీడియోలో ఓ అమ్మాయి లోదుస్తులతో ఉండగా వీడియో చాట్ చేయడం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగవైరల్ అయింది. మంత్రి, సదరు మహిళ లోదుస్తుల్లో ఉండగా ఇద్దరి మధ్య స్పష్టంగా వీడియో చాట్ కనిపిస్తోంది. దీనిపై మంత్రి ఇంకా స్పందించలేదు.

Read Also: Rohit Sharma: రోహిత్ మెరుపు ఇన్నింగ్స్.. మైదానంలో స్టాండింగ్ ఒవేషన్

దీనిపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ తీవ్రంగా స్పందించింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అతన్ని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. ‘‘ అశోక్ గెహ్లాట్ జీ, మీ మంత్రి ఒక మహిళతో ఉన్న అభ్యంతరకమ వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మంత్రి సలేష్ మహ్మద్ ను తొలగిస్తారా..? లేక విడిచిపెడతారా..?’’అంటూ రాజస్థాన్ బీజేపీ ట్వీట్ చేసింది.

బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ.. సలేహ్ మహ్మద్ ముస్లిం మత గురువు. మాజీ క్యాబినెట్ మంత్రి ఘాజీ ఫకీర్ కుమారుడు. అతని కారణంగా సలేహ్ ని మంత్రి చేశారు. ఇప్పటికే వారి కుటుంబం సోనియాగాంధీని స్పందించారు. అశోక్ గెహ్లాట్ ఈ విషయంలో ఏం చేయలేరని నేను భావిస్తున్నా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Show comments