Site icon NTV Telugu

Obesity In India: హిమాచల్ ప్రదేశ్‌లో ఊబకాయులు ఎక్కువ..

Obesity

Obesity

Obesity In India: భారత దేశం జనాభాలో ప్రపంచంలో మొదటి స్థానానికి చేరుకుంది. కేవలం జనాభాలోనే కాకుండా ఇప్పుడు రోగాల్లో కూడా అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఊబకాయులు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. ఇక మధుమేహంలో అయితే చిన్న వయస్సులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రధానంగా మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం.. ఈ మూడు వ్యాధులు ప్రపంచంలో కంటే భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియా డయాబెటిస్ నిర్వహించిన ఒక అధ్యయననాన్ని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీలో ప్రచురించారు. అయితే ఈ అధ్యయనం ప్రకారం మన దేశంలో అత్యధికంగా మధుమేహం, ఒబేసిటీ ఎక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. జాతీయ సగటుతో పోల్చుకుంటే ఈ రాష్ట్రంలోనే అత్యధికులు ఈ రెండు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.

Read also: Ashu Reddy : డ్రగ్స్ కేస్ పై స్పందించిన అషు రెడ్డి..అనవసరంగా ఆ విషయంలో నన్ను లాగుతున్నారు అంటూ ఆవేదన…

మధుమేహం, ప్రీ డయాబెటిస్ వ్యాప్తి జాతీయ సగటు రేటు 11.4, 15.3 శాతంగా ఉంది. కానీ హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం మధుమేహం 13.5 శాతంగా.. ప్రీ డయాబెటిస్‌ 18.7 శాతంగా ఉందని పరిశోధకులు తెలిపారు. రాష్ట్రంలో హైపర్ టెన్షన్(బీపీ) రేటు 35.3 శాతంగా ఉంది. కానీ జాతీయ సగటు 35.5 శాతం కంటే కొంత తక్కువగానే ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఊబకాయం రేటు కూడా జాతీయ గణాంకాల కంటే చాలా ఎక్కువ. 38.7 శాతం రాష్ట్ర వాసులు ఊబకాయంతో బాధపడుతున్నారు. కానీ జాతీయ స్థాయిలో 28.6 శాతం ఉంది. గత దశాబ్ద కాలంగా ఈ వ్యాధుల ప్రాబల్యం కొలిచేందుకు ఇటువంటి స్థాయిలో అధ్యయనం జరగలేదు. కొన్ని దశాబ్దాల క్రితం పాఠశాల విద్యార్థుల్లో టైప్ 2 డయాబెటిస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పిల్లల్లో కూడా మధుమేహం పెరుగుతోంది. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం కొన్ని దశాబ్దాల క్రితమే పుంజుకోవడం ప్రారంభించాయని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు వెల్లడించారు. శారీరక శ్రమ లేకపోవడమే ఈ వ్యాధుల పెరుగుదలకు పెద్ద కారణంగా భావిస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో, తోటల్లో పనులు సొంతంగా చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు పని సులభం చేసే పరికరాలు వచ్చిన తర్వాత శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇతర పనులకు కూలీలు దొరుకుతున్నారు. దీని వల్ల శరీరానికి సరైన శ్రమ లేకపోవడంతో బద్ధకం పెరిగిపోయింది. రోజుకి కనీసం 60 నిమిషాల పాటు శరీరాన్ని శ్రమ పెట్టె విధంగా పనులు చేయడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Read also: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రజలు ఆర్థికంగా మెరుగుపడటంతో పాటు వారి జీవనశైలి నిశ్చలంగా మారిపోతుంది. ఈ వ్యాధుల ప్రభావం పెరుగుదలకి దారి తీస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గతంలో వెల్లడించిన నివేదిక ప్రకారం మన దేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహ రొగులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. భారతదేశాన్ని ఇప్పటికే డయాబెటిస్‌కు రాజధానిగా పిలుస్తున్నారు. హైపర్ టెన్షన్, స్థూలకాయం, హైపర్ కొలస్ట్రొలేమియా వంటి వాటి వల్ల మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం భారతదేశం, అమెరికా, చైనా దేశాల్లోనే అత్యధికంగా మధుమేహం బారిన పడుతున్న వారి జనాభా ఉంది.

Exit mobile version