NTV Telugu Site icon

Yasin Malik: యాసిన్ మాలిక్ ఉరిశిక్ష కోసం ఎన్ఐఏ అభ్యర్థన.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..

Yasin Malik

Yasin Malik

Yasin Malik: టెర్రర్ ఫండిగ్ కేసులో కాశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో యాసిన్ మాలిక్ కు జీవితఖైదు పడింది. ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు సోమవారం యాసిన్ మాలిక్ కు నోటీసు జారీ చేసింది. న్యాయమూర్తులు సిద్ధార్థ్ మృదుల్ మరియు తల్వంత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 9న మాలిక్‌ను తమ ముందు హాజరుపరచాలని వారెంట్లు జారీ చేసింది.

Read Also: Delhi Incident: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్య.. యూపీలో పట్టుబడిన నిందితుడు..

నిందితుడు ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ తరుపున వాదనలు వినిపించిన సోలిసిటర జనరల్ తుషార్ మోహతా కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని ‘‘ అత్యంత అరుదైన’’ కేసుగా పరిగణించాలని కోర్టును కోరారు. ఈ కేసులో ఆయనకు మరణశిక్ష విధించాలని కోరారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న యాసిన్ మాలిక్, మరణశిక్షకు ప్రత్యామ్నాయమైన సెక్షన్ 121 ఐపీసీ కింద నేరాన్ని అంగీకరించారు.. కాబట్టి అతనికి నోటీసులు జారీ చేస్తున్నామని, జైలు సూపరింటెండెంట్ ద్వారా నోటీసులు అందించాలని కోర్టు ఆదేశించింది.

మే 24, 2022న ఎన్ఐఏ కోర్టు జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్ చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) కింద, ఇతర ఐపీసీ సెక్షన్ చట్టాల యావజ్జవ శిక్ష విధించింది. యూఏపీఏలో ఉన్న అన్ని నేరాలను యాసిన్ మాలిక్ అంగీకరించాడు. దీంతో అతనికి యావజ్జీవం విధించబడింది. అయితే ఈ శిక్షను ఉరిశిక్షగా పెంచాలని హైకోర్టులో ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. భయంకరమైన ఉగ్రవాదులు నేరాన్ని అంగీకరించిన తర్వాత కూడా ఉరిశిక్ష విధించకుంటే శిక్ష విధానం పూర్తిగా క్షీణిస్తుందని, ఉగ్రవాదులకు మరణశిక్షే నివారణ మార్గం అని తెలిపింది. దేశం, సైనిక కుటుంబాలు ప్రాణాలు కోల్పోయేలా చేసిన నేరాలకు జీవితఖైదు సరిపోదని, యాసిన్ మాలిక్ నేరాలను అత్యంత అరుదైన కేసు కింద చూడాలని కోర్టు హైకోర్టును కోరింది.

Show comments