Udhayanidhi Stalin: “ప్రధాని, ఈడీకి భయపడం”.. నీతి ఆయోగ్ మీటింగ్‌కి స్టాలిన్ హజరుపై ఉదయనిధి..
- ‘‘ప్రధాని, ఈడీకి మేము భయపడం’’..
- నీతి ఆయోగ్ సమావేశానికి స్టాలిన్ హజరుపై ఉదయనిధి..
- ప్రతిపక్ష ఆరోపణల్ని తిప్పికొట్టిన జూనియర్ స్టాలిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం స్టాలిన్ పాల్గొనడంపై ప్రతిపక్షాల ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు. డీఎంకే నాయకత్వం ఈడీ లేదా ప్రధాని మోడీకి భయపడదని అన్నారు. తమిళనాడు ప్రజలకు సరైన ఆర్థిక కేటాయింపులు సాధించాలనే ఆసక్తితోనే ముఖ్యమంత్రి న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
Read Also: Operation Sindoor: భారత్ దాడిలో పాకిస్తాన్‌కి తీరని నష్టం.. ఏకంగా రూ. 28,000 కోట్లు ఆవిరి..
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
‘‘రాష్ట్రానికి నిధులు కోరేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. ఎప్పటిలాగే, ప్రతిపక్షం ఈ విషయాన్ని రాజకీయం చేస్తోంది’’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ఎడప్పాడి కే పళనిస్వామి వ్యాఖ్యలకు జూనియర్ స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. గతంలో నీతి ఆయోగ్ సమావేశాలను బహిష్కరించడం వల్ల తమిళనాడు కీలకమైన నిధుల్ని కోల్పోయిందని, ముఖ్యంగా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) పై ఇటీవల ED చర్య తీసుకున్న తర్వాత, కేంద్ర ఏజెన్సీ దాడుల భయంతోనే ఈ సంవత్సరం సమావేశానికి స్టాలిన్ హాజరయ్యారని పళనిస్వామి ఆరోపించారు.
పళనిస్వామి ఆరోపణలకు ఉదయనిధి స్పందిస్తూ..‘‘వారు మిమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నించారు. కానీ మేము లొంగిపోయే బానిస పార్టీ కాదు. ఈ పార్టీని కలైంజర్ సృష్టించారు. పెరియార్ భావజాలం ఉంది. దోషులు మాత్రమే భయపడాలి, మేము చట్టబద్ధంగా ప్రతీదాన్ని ఎదుర్కొంటాము’’ అని అన్నారు.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!