Ram Temple Event: “మోడీకి వ్యతిరేకం కాదు, కానీ”.. రామ మందిర వేడుకలకు హాజరుకాబోమన్న ఇద్దరు శంకరాచార్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Temple Event: అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి తాను హాజరుకాబోవడం లేదని గతంలో పూరీ శంకరాచార్య చెప్పారు. ఈ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని అన్నారు. రామాలయంపై రాజకీయం చేస్తున్నారని పూరీలోని గోవర్థన మఠం పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి తాను దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆయనతో జతకలిశారు ఉత్తరాఖండ్ జోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి.
ఈ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావద్దని ఉత్తరాఖండ్ జోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి కోరారు. సనాతన ధర్మ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని, తాను ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా వెళ్లలేనని, అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని చెబుతున్నారు. పూర్తిగా ఆలయాన్ని నిర్మించకుండానే ప్రాణప్రతిష్ట చేయడమేంటని ప్రశ్నించారు.
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
- E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
‘‘ప్రధాని నరేంద్రమోడీ గర్భగుడిలో ఉండీ విగ్రహాన్ని తాకుతారు. దీనికి రాజకీయ కోణం ఇస్తున్నారు. శ్రీరాముడి ప్రతిష్టాపనను గౌరవప్రదంగా చేయాలి. నేను దీన్ని వ్యతిరేకించను, హాజరుకాను’’ అని పూరి శంకరాచార్య అన్నారు. నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచానని, ప్రతిదీ సజావుగా జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
Read Also: Congress Meeting: రాబోయే పార్లమెంటు ఎన్నికల విధివిధానాలపై చర్చ జరిగింది..
ఈ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావద్దని ఉత్తరాఖండ్ జోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి చెప్పారు. సనాతన నిబంధనలు ఉల్లంఘిస్తునందుకు హిందూ గురువులు ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఆయన హరిద్వార్‌లో చెప్పారు. అయితే, ద్వారక, శృంగేరి మఠాలకు చెందిన పీఠాధిపతులు మాత్రం ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు.
శంకరాచార్య అనేది హిందూ మతంలో అద్వైత వేదాంత సంప్రదాయంలో పేర్కొన్న మఠాధిపతులను సూచిస్తుంది. ఆదిశంకరాచార్యులు ఉత్తరాన బదరికాశ్రమ జ్యోతిష్ పీఠం, పశ్చిమాన ద్వారక శారదా పీఠం, తూర్పున పూరిలోని గోవర్ధన్ పీఠం, కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో శృంగేరి శారదా పీఠం వద్ద నాలుగు మఠాలను స్థాపించారని చెబుతారు.
తాజావార్తలు
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!