Site icon NTV Telugu

Jammu Kashmir: కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. స్థానికేతరుడి కాల్చివేత..

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో స్థానికేతర కార్మికుడు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తిని పంజాబ్ అమృత్‌సర్‌కి చెందిన అమృత్ పాల్ సింగ్‌గా గుర్తించారు. క్షతగాత్రుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన శ్రీనగర్ పట్టణంలోని షహీద్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

Read Also: Yogi Adityanath: “కృష్ణుడు 5 గ్రామాలు అడిగాడు, మేం 3 అడుగుతున్నాం”.. అయోధ్య, మధుర, కాశీలపై యోగి..

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేత సమర్థవంతంగా జరుగుతుండటంతో గతంలోలా కాకుండా అక్కడి ఉగ్రవాదులు హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. స్థానికేతరులు, హిందువులు, దేశానికి మద్దతుగా ఉండే వారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ ఘటనకు ముందు గతేడాది అక్టోబర్ నెలలో పుల్వామాలో ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వలస కార్మికుడిని కాల్చి చంపారు. అదే రోజు పోలీస్ ఇన్స్‌పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై కాల్పులు జరిపారు. 2019 నుంచి స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

Exit mobile version