Site icon NTV Telugu

Noida: పనిలో నిర్లక్ష్యం.. ఉద్యోగులకు సీఈవో ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారంటే..!

No

No

కంపెనీ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ పద్ధతుల్లో ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. నిబంధనలు మీరితే.. యాజమాన్యం ఏ చర్యలకైనా ఉపక్రమిస్తుంది. తాజాగా నోయిడాలో జరిగిన ఘటన వార్తల్లో నిలిచింది. కంపెనీ రూల్స్ అతిక్రమించినందుకు సీఈవో.. ఉద్యోగులకు పనిష్మెంట్ విధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పని నిమిత్తం కార్యాలయంలోకి వచ్చిన ఓ వృద్ధుడికి ఉద్యోగులు అసౌకర్యం కల్పించారు. అంతే ఈ ఘటనపై కంపెనీ సీఈవో ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూల్లో పిల్లలకు శిక్ష విధించినట్లుగా.. ఉద్యోగులకు శిక్ష విధించారు. 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలంటూ దండించారు. దీంతో ఉద్యోగులంతా 20 నిమిషాల పాటు నిలబడి పని చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Bihar: 12 ఏళ్ల బాలికపై మామ అత్యాచారం.. ఆ తర్వాత కొట్టి చంపి

ఉత్తరప్రదేశ్‌లోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ అథారిటీకి చెందిన కార్యాలయంలో సుమారు 16 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ పనుల మీద నోయిడా ప్రజలు వస్తుంటారు. ఈ అథారిటీకి గత ఏడాది సీఈఓగా ఐఏఎస్‌ అధికారి డాక్టర్ లోకేశ్‌ నియమితులయ్యారు. అయితే ప్రజలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా సహించరు. ఇక వృద్ధులను ఎక్కువసేపు నిలబెట్టకుండా చూడాలని హెచ్చరిస్తుంటారు. అందుకోసం సీసీటీవీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సిబ్బంది పనితీరును గమనిస్తుంటారు. అయితే సోమవారం ఒక వృద్ధుడు కౌంటర్ దగ్గర నిలబడి ఉండటాన్ని కెమెరాలో చూశారు. ఆయన పనేంటో చూడాలని వెంటనే మహిళా ఉద్యోగికి సూచించారు. అయినా కూడా 20 నిమిషాల తర్వాత కూడా అదే కౌంటర్ దగ్గర వృద్ధుడు నిలబడి ఉండటాన్ని సీఈవో గమనించారు. దీంతో వెంటనే కార్యాలయం దగ్గరకు వచ్చి, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 20 నిమిషాల పాటు నిల్చోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సీఈవో తీరును ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. మిస్టరీగా ఆడియో రికార్డ్!

 

Exit mobile version