Noida Farmer: అదృష్టమంటే ఇదే కదా? హెలికాప్టర్ కొని థాయ్‌లాండ్ టూర్.. రైతు జీవితాన్ని మార్చేసిన మోడీ సర్కార్
- నోయిడా రైతు తలుపు తట్టిన అదృష్టం
- మోడీ సర్కార్ రూపంలో కలిసొచ్చిన అదృష్టం
- హెలికాప్టర్ కొనుగోలు చేసి థాయ్‌లాండ్ టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితం బాగుపడాలంటే అదృష్టం కలిసి రావాలనో.. లేదంటే లాటరీ అయినా తగలాలనో అంటుంటారు. ఈ మాటలు సరదాగే అనుకున్న కూడా.. నిజంగా జరిగితే మాత్రం లైఫ్ మొత్తం మారిపోతుంది. నోయిడాలో ఓ రైతు జీవితాన్ని మోడీ సర్కార్ మార్చేసింది. రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. అంతేకాకుండా ఓ హెలికాప్టర్ కొనుగోలు చేసి ఫారిన్ టూర్‌కు కూడా రెడీ అయిపోయాడు. అసలేం జరిగింది? హెలికాప్టర్-మోడీ సర్కార్‌కు ఉన్న లింకేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
నిన్నామొన్నటి దాకా ఆ రైతులంతా సాధారణ అన్నదాతలు. ఏదో తమకున్న పొలాల్లో పంటలు పండించుకుని జీవితాన్ని సాగిస్తున్నారు. అలాంటి కర్షకులకు మోడీ సర్కార్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. అంతే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. ఉన్నట్టుండి పేద బతుకులు లగ్జరీగా మారిపోయాయి. ఇదంతా కేవలం మోడీ సర్కార్ పుణ్యమా? అని అదృష్టం కలిసొచ్చింది.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
శనివారం ప్రధాని మోడీ నోయిడాలో దేశంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా నోయిడాలో మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు పూనుకుంది. అందుకోసం రైతుల దగ్గర పెద్ద ఎత్తున భూములు సేకరించింది. అయితే భూములకు పరిహారంగా అన్నదాతలకు కోట్లలో నగదు ముట్టజెప్పారు. అంతే ఒక్కసారిగా రైతుల దశ మారిపోయింది. లక్షల్లో కాకుండా ఏకంగా కోట్లలో కర్షకులకు డబ్బు అందింది. దీంతో నోయిడా రైతులందరూ భాగ్యవంతులైపోయారు.
ఏకంగా ఒక రైతుకు అయితే రూ.15 కోట్లు అందాయి. దీంతో అతడు ఒక హెలికాప్టర్ కొనుగోలు చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి థాయ్‌లాండ్ పర్యటనకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తన కథనంలో వెల్లడించింది. లబ్ధిపొందిన రైతులు తమ ఆనందాన్ని, సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. నోయిడా ఎయిర్‌పోర్టుకు భూములు ఇవ్వడంతో తమ జీవితాలు మారిపోయాయని పలువురు చెప్పుకొచ్చారు.
ఇక ఈ వార్త ప్రస్తుతంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు రకరకాలుగా స్పందించారు. ‘‘ఇది శుద్ధ అవివేకం. మహారాష్ట్రలో కూడా ఇలాంటి కేసులు చూశాం. అక్కడ ప్రజలు కూడా పరిహారాన్ని అనేక విలాసవంతమైన కార్ల మీద ఖర్చుపెట్టి రెండేళ్లలోపే ఇంధనం వంటి ప్రాథమిక ఖర్చులకే ఇబ్బంది పడ్డారు. పూణె సమీపంలోని ముల్షి వంటి ప్రదేశాల్లో ఇలాంటి కథలు సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో తర్వాతి తరం కూడా నేరాల వైపు మళ్లింది..’’ అని రాసుకొచ్చాడు.
తాజావార్తలు
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!