Site icon NTV Telugu

Only Teacher: స్కూల్‌లో ఇక నో సార్‌.. నో మేడం.. ఓన్లీ టీచర్‌..

Teacher

Teacher

Only Teacher: పాఠశాలల్లో పురుషు ఉపాధ్యాయులను సార్‌ అని.. మహిళా ఉపాధ్యాయులను మేడం అంటూ సంబోధిస్తుంటారు.. అయితే, పాఠశాలల్లో ఇక నో ‘సర్’.. నో ‘మేడమ్’.. ఓన్లీ ‘టీచర్’ అంటోంది కేరళ.. ఉపాధ్యాయులకు సర్ లేదా మేడమ్ వంటి గౌరవప్రదమైన పదాల కంటే లింగబేధం లేని తటస్థ పదం టీచర్‌ మంచిదని కేరళ చైల్డ్ రైట్స్ ప్యానెల్ నిర్దేశించింది. కేరళ స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (KSCPCR) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను పాఠశాల ఉపాధ్యాయులను వారి లింగంతో సంబంధం లేకుండా ‘సర్’ లేదా ‘మేడమ్’ అని కాకుండా ‘టీచర్’ అని సంబోధించాలని ఆదేశించింది..

Read Also: Post Office Super RD Plan: ప్రతి నెల రూ.5వేల పెట్టుబడికి.. రూ.2లక్షల వడ్డీ వస్తుంది

కేఎస్‌సీపీసీఆర్‌ ఆదేశాల్లో “సర్” మరియు “మేడమ్” వంటి పదాలను పిలవడాన్ని నివారించాలని పేర్కొంది.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘టీచర్‌’ అనే పదాన్ని ఉపయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్యానెల్ చైర్‌పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు సీ విజయకుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సాధారణ విద్యాశాఖను ఆదేశించింది. సార్ లేదా మేడమ్ అని కాకుండా టీచర్ అని పిలవడం అన్ని పాఠశాలల పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో సహాయపడుతుందని మరియు ఉపాధ్యాయులతో వారి అనుబంధాన్ని కూడా పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఉపాధ్యాయులను వారి లింగం ప్రకారం ‘సార్’ మరియు ‘మేడమ్’ అని సంబోధిస్తూ వివక్షను అంతం చేయాలని కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version