NTV Telugu Site icon

Mehabooba Mufti: ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పొత్త ఉండబోదు..

Mufti

Mufti

Mehabooba Mufti: శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సభలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మాత్రం పీడీపీనే అని పేర్కొన్నారు. జమ్మూలో తమ గెలుపును ఎవరూ ఆపలేరు.. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. 1947 నుంచి అలానే చేస్తున్నారని వారికి అంతకు మించి వేరే టార్గెట్ లేదని ఆరోపించింది. కేవలం మంత్రి పదవుల కోసమే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ- కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని ముఫ్తీ తెలిపారు.

Read Also: CM Chandrababu: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్‌.. పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదు..!

పీడీపీ మద్దతు లేకుండా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని మెహబూబా ముఫ్తీ అన్నారు. 2002లో కేవలం 16 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఏర్పాటు చేశాం.. కానీ, ప్రస్తుతం అలాంటి తరహా పరిస్థితులే నెలకొంటాయని అన్నారు. తమ ఎజెండాను అమలు చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాం.. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం గతంలో భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపాం.. కానీ బీజేపీ కశ్మీర్ అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రయత్నాలను తోసిపుచ్చింది.. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని వెల్లడించింది. బీజేపీతో పీడీపీకి ఎలాంటి సంబంధాలు లేవు.. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆశిస్తున్నాను.. పోలీసులు ప్రజలను పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధింపులకు గురి చేయడం లాంటి చర్యలను వెంటనే ఆపివేయాలని మెహబూబా ముఫ్తీ కోరారు.