NTV Telugu Site icon

Jairam Ramesh: కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కోవడం ఏ ఫ్రంట్‌కు సాధ్యం కాదు..

Jai Ram Ramesh

Jai Ram Ramesh

Jairam Ramesh: కాంగ్రెస్ లేకుండా బీజేపీ ఎదుర్కోవడం ఏ ఫ్రంట్ కు సాధ్యం కాదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఏర్పడితే అందులో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే రాబోయే కర్ణాటక ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని, ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు. ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ లేకుండా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్న నేపథ్యంలో జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

READ ALSO: Women’s Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి..

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరాంలలో ఎన్నికలు ఉన్నాయని ప్రస్తుతం కాంగ్రెస్ వాటిపై దృష్టి సారిస్తోందని అన్నారు. వీటి తర్వాతే 2024 లోక్ సభ ఎన్నికల గురించి ఆలోచిస్తాం అని తెలిపారు. ఏ ప్రతిపక్ష కూటమి అయిన బలపడాలంటే కాంగ్రెస్ అవసరం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆలోచన కర్ణాటక ఎన్నికలపైనే అని తెలియజేశారు. 2024 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే పార్టీ నేతలతో చర్చలు జరుపుతారని తెలిపారు.

ఆదానీ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల్లో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ పాల్గొనకపోవడంపై స్పందింస్తూ ఆ పార్టీలకు సొంత లాజిక్ ఉండొచ్చని అన్నారు. ఇటీవల 16 పార్టీలు ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని సంతకాలు చేశాయి. దీనికి టీఎంసీ, ఎన్సీపీ దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం మా గొంతు వినిపించేలా ప్రయత్నాలు చేస్తున్నామని, మాపై తప్పుడు ప్రచారం, వేధింపులు జరుగుతున్నాయని, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్న ఈ వేధింపులను మేము ఎదుర్కొంటాం తెలిపారు. అదానీ, చైనా వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలను అనుమతించడం లేదని ఆయన విమర్శించారు. భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిందని, ఇది బీజేపీని ఆందోళనకు గురిచేస్తోందని ఆయన తెలిపారు.