High Court: అలా చేస్తే భార్యకు “భరణం” చెల్లించాల్సిన అవసరం లేదు..

  • సరైన కారణం చెప్పకుండా భర్తని వదిలేస్తే భరణం అవసరం లేదు..
  • భార్య భరణం కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
Law News

Law News

High Court: ఇటీవల విడాకులు తీసుకుంటూ, ఇష్టారీతిన భరణం కోరుతున్న మహిళలకు షాక్ ఇచ్చేలా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ‘‘సహేతుకమైన కారణం లేకుండా తన భర్త నుంచి విడిగా జీవించాలని భావించే భార్య భరణానికి అర్హురాలు కాదు’’ అని కోర్టు చెప్పింది. భరణం పొందే హక్కును నిర్ణయించడానికి వైవాహిక స్థితి కేవలం ఆధారం కాదని, ప్రవర్తనపై కూడా ప్రాధాన్యత ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

ఈ కేసులో వివాహం తర్వాత నాలుగు రోజులకే ఒక మహిళ తన భర్త, అత్తమామలపై వరకట్న వేధింపులు, మానసిక శారీరక వేధింపుల ఆరోపణలు చేసింది. అత్తమామలు రూ. 10 లక్షలు, కారు డిమాండ్ చేసినట్లు ఆరోపించింది. దీని తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్టార్ 125 కింద భరణం కోరింది. భర్త కాపురానికి సిద్ధంగా ఉన్నాడని, బిలాస్‌పూర్ ఫ్యామిలీ కోర్టు ఆమె భరణం అభ్యర్థనను తిరస్కరించింది.

Read Also: YV Subba Reddy: సిట్ రిపోర్టులో ఉన్నదేంటి? మీరు ప్రచారం చేస్తుందేంటి?

ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. భార్య తన భర్త నుంచి విడిపోవడాన్ని సమర్థించే తగిన ఆధారాలు లేవని పేర్కొంది. సరైన కారణంగా లేకుండా భార్య తన అత్తగారి ఇంటిని విడిచిపెట్టి, భర్త సంసారాన్ని చక్కదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నా, ఆమె రావడానికి నిరాకరించినప్పుడు, ఆమెకు భరణం పొందే హక్కు లేదని ధర్మాసనం పేర్కొంది. సీఆర్పీసీ 125 సెక్షన్‌ను ప్రస్తావిస్తూ.. భార్య తగిన కారణం లేకుండా విడివిడిగా నివసిస్తున్న సందర్భాలలో భరణాన్ని స్పష్టంగా నిషేధిస్తుందని పేర్కొంది. భరణం అనేది నిజంగా విడిపోయిన వారికి, క్రూరత్వ కేసులను రక్షించడానికి ఉద్దేశించినవని, విడిపోవడానికి చట్టబద్ధమైన సమర్థన లేని చోట ఉపయోగించకూడదనే సూత్రాన్ని ఈ తీర్పు బలోపేతం చేస్తుంది.