High Court: అలా చేస్తే భార్యకు “భరణం” చెల్లించాల్సిన అవసరం లేదు..
- సరైన కారణం చెప్పకుండా భర్తని వదిలేస్తే భరణం అవసరం లేదు..
- భార్య భరణం కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: ఇటీవల విడాకులు తీసుకుంటూ, ఇష్టారీతిన భరణం కోరుతున్న మహిళలకు షాక్ ఇచ్చేలా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ‘‘సహేతుకమైన కారణం లేకుండా తన భర్త నుంచి విడిగా జీవించాలని భావించే భార్య భరణానికి అర్హురాలు కాదు’’ అని కోర్టు చెప్పింది. భరణం పొందే హక్కును నిర్ణయించడానికి వైవాహిక స్థితి కేవలం ఆధారం కాదని, ప్రవర్తనపై కూడా ప్రాధాన్యత ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసులో వివాహం తర్వాత నాలుగు రోజులకే ఒక మహిళ తన భర్త, అత్తమామలపై వరకట్న వేధింపులు, మానసిక శారీరక వేధింపుల ఆరోపణలు చేసింది. అత్తమామలు రూ. 10 లక్షలు, కారు డిమాండ్ చేసినట్లు ఆరోపించింది. దీని తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్టార్ 125 కింద భరణం కోరింది. భర్త కాపురానికి సిద్ధంగా ఉన్నాడని, బిలాస్పూర్ ఫ్యామిలీ కోర్టు ఆమె భరణం అభ్యర్థనను తిరస్కరించింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: YV Subba Reddy: సిట్ రిపోర్టులో ఉన్నదేంటి? మీరు ప్రచారం చేస్తుందేంటి?
ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. భార్య తన భర్త నుంచి విడిపోవడాన్ని సమర్థించే తగిన ఆధారాలు లేవని పేర్కొంది. సరైన కారణంగా లేకుండా భార్య తన అత్తగారి ఇంటిని విడిచిపెట్టి, భర్త సంసారాన్ని చక్కదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నా, ఆమె రావడానికి నిరాకరించినప్పుడు, ఆమెకు భరణం పొందే హక్కు లేదని ధర్మాసనం పేర్కొంది. సీఆర్పీసీ 125 సెక్షన్‌ను ప్రస్తావిస్తూ.. భార్య తగిన కారణం లేకుండా విడివిడిగా నివసిస్తున్న సందర్భాలలో భరణాన్ని స్పష్టంగా నిషేధిస్తుందని పేర్కొంది. భరణం అనేది నిజంగా విడిపోయిన వారికి, క్రూరత్వ కేసులను రక్షించడానికి ఉద్దేశించినవని, విడిపోవడానికి చట్టబద్ధమైన సమర్థన లేని చోట ఉపయోగించకూడదనే సూత్రాన్ని ఈ తీర్పు బలోపేతం చేస్తుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..