Site icon NTV Telugu

వ్యాక్సినేష‌న్‌పై ఎవ‌ర్నీ బ‌ల‌వంత‌పెట్ట‌డం లేదు…

Supreme Court

Supreme Court

క‌రోనాను క‌ట్ట‌డి చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భుత్వం సూచించిన వ్యాక్సిన్‌ను తీసుకోవాల‌ని కేంద్ర ఆరోగ్యశాఖ ప్ర‌తిరోజూ ప్ర‌చారం చేస్తున్న‌ది. మొద‌టి వేవ్ త‌రువాత దేశంలో వ్యాక్సినేష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. ద‌శ‌ల వారీగా ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందిస్తున్నారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకుంటే జ‌రిమానా విధిస్తామ‌ని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్‌ను తప్ప‌నిస‌రి చేశారు. మాస్క్ త‌ప్ప‌నిస‌రి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సినేష‌న్‌పై సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ్య‌క్తికి సంబంధించిన సొంత విష‌యం అని, ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌ల‌వంతంగా వ్యాక్సిన్ వేయ‌కూడ‌ద‌ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. కాగా, సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేసింది. ఆరోగ్య‌శాఖ ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తుందే తప్ప ఎవ‌ర్నీ బ‌ల‌వంతం చేయ‌డం లేద‌ని పేర్కొన్న‌ది. ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా దేశంలో థ‌ర్డ్ వేవ్ ఎంట‌ర్ అయింది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. చాలా మంది వ్యాక్సిన్‌పై ఉన్న అపోహ‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల‌న వ్యాక్సిన్‌ను తీసుకోవ‌డానికి నిరాక‌రిస్తున్నారు.

Read: వైరల్ వీడియో : పూణే పోలీసుల సృజనాత్మకతకు కరీనా కపూర్ ఫిదా

Exit mobile version