NTV Telugu Site icon

Amit Shah: రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండదు.. పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలు..

Amit Shah

Amit Shah

Amit Shah: పొత్తుల గురించి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మిత్రపక్షాలను ఎప్పుడూ స్వాగతిస్తామని, పాత మిత్రుడైన శిరోమణి అకాళీదళ్‌తో చర్చలు జరుగుతున్నాయని ఆయన శనివారం అన్నారు. రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండని చెప్పారు. జయంత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్‌దళ్(ఆర్ఎల్డీ), శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), ఇతర ప్రాంతీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లో చేరే అవకాశం గురించి అడిగిన సందర్భంలో అమిత్ షా ఈ విధంగా వ్యాఖ్యానించారు.

Read Also: Vijayashanthi: ఆయనకి కూడా ఇస్తే తెలుగు జాతి పులకించిపోయేది.. ‘భారతరత్న’పై విజయశాంతి కామెంట్స్

మా కూటమి పెరగాలని మేము ఎప్పుడు కోరుకుంటామని, కొత్త మిత్రులను ఎల్లప్పుడూ స్వాతిస్తామని, జన సంఘ్ నుంచి మా భావజాలంలో అలాగే ఉందని, మాతో చేరే వారు రావచ్చని ఆయన ఓ కార్యక్రమంలో చెప్పారు. అకాళీదళ్ రీఎంట్రీపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఏదీ ఖరారు కాలేదని అన్నారు. ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న ఎస్ఏడీ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా 2020లో ఎన్డీయే నుంచి వైదొలిగింది. 2018లో ఎన్డీయే నుంచి వైదొలిగిన తెలుగుదేశం(టీడీపీ) లేదా వైఎస్ఆర్సీపీతో చేతులు కలిపే విషయంపై మాట్లాడుతూ.. కొంత కాలం తర్వాత అంతా తేలిపోతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి మరింత బలపడేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన పార్టీ జేడీయూ కూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేతో జతకట్టారు. ఆర్ఎల్డీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోంది.

బీజేపీ కూటమి నుంచి ఏ భాగస్వామి విడిపోవాలని ఎన్నడూ కోరుకోలేదని, రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలకే అవకాశం ఇచ్చామని అమిత్ షా అన్నారు. ఎన్డీయే నుంచి కొందరు వెళ్లిపోగా.. కొత్త వారు వచ్చారని, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, కొన్ని సంఘటనల వల్ల కొన్ని పార్టీలు వెళ్లిపోయాయని అన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని కొనసాగించిందని చెప్పారు.