Site icon NTV Telugu

Nitish Kumar: మళ్లీ ఎన్డీయేలోకి నితీష్ కుమార్..? వరస భేటీలతో ఊహాగానాలు..

Nitish Kumar

Nitish Kumar

విపక్షాల ఐక్యతను బీహార్ సీఎం నితీష్ వదిలేస్తున్నారా.. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి మళ్లీ చేరబోతున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరసగా భేటీలు చూస్తే కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఆయన రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్‌తో భేటీ అయ్యారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు, జేడీయూలో చీలక గురించి భయపడుతున్నారా..? అనే రూమర్స్ తెరపైకి వచ్చాయి.

గతేడాది ఆగస్టులో బీజేపీతో పొత్తు తెంచుకుని, ఆర్జేడీ-కాంగ్రెస్ సహాయంతో మరోసారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్. అయితే ఆ సమయంలో రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ గా హరివంశ్ ఉన్నారు. అప్పటి నుంచి హరివంశ్ తో సీఎం నితీష్ కుమార్ ఎప్పుడూ భేటీ కాలేదు. కానీ తాజాగా ఈ రోజు ఆయనతో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీతో పొత్తు తెంచుకున్న సమయంలో హరివంశ్ ను స్పీకర్ పదవి నుంచి తొంలగించేందుక ఇటు బీజేపీ కానీ.. అటు జేడీయూ కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నితీష్ కుమార్ బీజేపీతో టచ్ లో ఉండేందుకే హరివంశ్ ను అలాగే ఉంచారనే వాదనలు కూడా ఉన్నాయి.

Read Also: Bandi Sanjay: కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకుపోవాల్సి వస్తుంది

ఇదిలా ఉంటే గత ఐదు రోజులుగా నితీష్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వరసగా భేటీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం హరివంశ్ తో సమావేశమయ్యారు. నిజానికి తెలుస్తున్న సమాచారం ప్రకారం.. 2019 ఎన్నికల్లో జేడీయూ ఎంపీలు, ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. మళ్లీ వారితోనే పొత్తు పెట్టుకోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపొందిన జేడీయూ ఎంపీలకు 2024 ఎన్నికల్లో టికెట్లు నిరాకరిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వారంతా భయపడుతున్నట్లు సమాచారం. ఇటీవల పాట్నా వేదికగా నితీష్ కుమార్ విపక్షాల సమావేశం నిర్వహించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఐక్యంగా పోరాటం చేయాలని హజరైన అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. తర్వాత సమావేశం బెంగళూర్ వేదికగా విపక్షాల సమావేశం జరగాల్సి ఉంది.

Exit mobile version