NTV Telugu Site icon

Nitish Kumar: “ఇండియా కూటమిలో ఊపు లేదు”.. బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు..

Nitish Kuamr

Nitish Kuamr

Nitish Kumar: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలంతా కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఈ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి సీట్లు కేటాయించపోవడంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇండియా కూటమికి తొలిసమావేశాన్ని నిర్వహించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో మొదట ఉన్న పురోగతి, ఊపు ఇప్పుడు లేదని దానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉందని, దీంతోనే ఇండియా కూటమిలో పెద్దగా పురోగతి లేదని ఆయన అన్నారు.

Read Also: North Korea: టెర్రర్ గ్రూపులకు నార్త్ కొరియా ఆయుధాలు.. విక్రయించేందుకు కిమ్ ప్రయత్నం..

‘బీజేపీ హటావో, దేశ్ బచావో’(బీజేపీని అధికారం నుండి తరిమికొట్టండి, దేశాన్ని రక్షించండి) అనే థీమ్‌తో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పాట్నాలో నిర్వహించిన ర్యాలీలో జేడీ(యు) నాయకుడు ఈ వ్యాఖ్య చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఇతర నాయకులు హాజరయ్యారు. కేంద్రంలోని ప్రస్తుతం పాలనను వ్యతిరేకించే పార్టీతో కలిసి కొత్త కూటమి ఏర్పాటే చేశామని నితీష్ కుమార్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందని, ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పాత్రను కట్టబెట్టామని, అయితే వారు ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే తదుపరి సమావేశానికి పిలుపునిస్తారని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే నితీష్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది ఆ పార్టీ నేత షెహజాద్ పూనావాలా.. ‘‘తుక్డే తుక్డే’’ కూటమిగా అభివర్ణిస్తూ, రాహుల్ గాంధీ ‘ఇండియా’ జోడో యాత్ర చేయాలని కూటమిని ఉద్దేశించి ఎక్స్‌లో విమర్శలు చేశారు.

Show comments