NTV Telugu Site icon

Modi-Nitish Kumar: మోడీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన నితీష్ కుమార్.. మోడీ ఏం చేశారంటే.?

Modi Nitish Kumar

Modi Nitish Kumar

Modi-Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీ పాదాలను తాకబోయారు. బీహార్ దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ.. 73 ఏళ్ల నితీష్ కుమార్, 74 ఏళ్ల ప్రధాని మోడీ వైపు కదులుతూ.. పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు.

అయితే, వెంటనే ప్రధాని మోడీ తన పాదాలను తాకకుండా నితీష్ కుమార్‌ని అడ్డుకున్నారు. అతడితో కరచాలనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. పార్టీ కార్యకర్తలు ప్రధాని మోడీకి పూల మాల వేస్తుండగా.. నితీష్ కుమార్‌ని మోడీ తన వైపు లాగుతున్న మరో వీడియో కూడా ఇదే వేదిక నుంచి వచ్చింది.

Read Also: Marco rubio: పాకిస్తాన్‌ కష్టం.. ఇండియాకి ఇష్టం.. ట్రంప్ కీలక ఎంపిక..

నితీష్ కుమార్ ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. జూన్‌లో నితీష్ కుమార్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మోడీ పాదాలను తాకేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లంత ఆశ్చర్యపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నవాడాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో కూడా ప్రధాని మోడీ పాదాలను తాకారు. నితీష్ కుమార్ జేడీయూ బీజేపీకి రెండో అతిపెద్ద మిత్రపక్షం. ఈ ఏడాది ప్రధాని మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయడానికి జేడీయూ ఎంపీలు కీలకంగా మారారు. బీజేపీ సొంతగా మెజారిటీ సాధించడంలో విఫలం కావడంతో టీడీపీ, జేడీయూ మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడింది.

జంగిల్ రాజ్ నుంచి బీహార్‌ని నితీష్ కుమార్ బయటకు తీసుకువచ్చారని ప్రధాని మోడీ అన్నారు. రూ.12,100 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలను మోడీ ప్రారంభించారు. లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. ఎన్డీయే పాలనలో బీహార్ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో మెరుగుపడిందని అన్నారు.