Site icon NTV Telugu

Nitish kumar: మనమంతా కలిస్తే వచ్చే ఏన్నికల్లో బీజేపీకి 100 కన్నా తక్కువ సీట్లు

Nitish Kumar

Nitish Kumar

Nitish kumar: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ హా అన్ని ప్రతిపక్షాలు చేతులు కలపాలని కోరారు. యునైటెడ్ ఫ్రంట్ బీజేపీని 100 కన్నా తక్కువ సీట్లకు పరిమితం చేయగలదని అన్నారు. కాంగ్రెస్ తో పాటు విపక్షాలు హాజరైన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Tarakaratna: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..

కాంగ్రెస్ పార్టీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. వారు నా సూచనను స్వీకరించి కలిసి పోరాడితే బీజేపీని అధికారానికి దూరం చేయవచ్చని, ఒక వేళ ఈ సూచనను తీసుకోకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసని నితీష్ కుమార్ అన్నారు. పాట్నాలో జరిగిన సీపీఐ-ఎం 11వ మహాసభలో ఆయన మాట్లాడుతూ, తనకు ప్రధానమంత్రి కావాలనే ఆశలు లేవని, ఆ పదవికి పోటీదారునని కూడా మరోసారి పునరుద్ఘాటించారు. దేశాన్ని ఏకం చేయడం, విద్వేషానలు వ్యాప్తి చేసే వ్యక్తల నుంచి విముక్తి చేయడమే తన ఆశయం అని.. నాకు ఇంకేం వద్దని మేము మీతో ఉంటామని నితీష్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ పాల్గొన్నారు. ఎన్డీయే కూటమిలో బీజేపీతో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ జేడీయూ, గతేడాది పొత్తును తెంచుకుని, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుంచి బీజేేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు నితీష్ కుమార్. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేతులు కలిపితే..భారీ మెజారిటీతో గెలవవచ్చని పలుమార్లు సూచించారు.

Exit mobile version