NTV Telugu Site icon

Janata Dal United: రావడం కుదరదు.. కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన జేడీయూ

Jdu Jodo Yatra Event

Jdu Jodo Yatra Event

Nitish Kumar Party JDU To Skip Bharat Jodo Yatra Event In Srinagar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలోనే యాత్ర ముగింపు సభను జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ ముగింపు సభకు హాజరు కావాల్సిందిగా.. ఒక్క బీజేపీని మినహాయించి మొత్తం 24 రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానం పంపడం జరిగింది. అయితే.. ఈ ఆహ్వానాన్ని నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) తిరస్కరించింది. అదే రోజు నాగాలాండ్‌లో తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తోందని.. కాబట్టి భారత్ జోడో యాత్ర ముగింపు సభకు రావడం కుదరదని ఖర్గేకు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ లేఖ రాశారు.

Nandamuri Balakrishna: అక్కడ ఆప్యాయత లేదు.. మరోసారి మాట తూలిన బాలయ్య

“దేశంలో ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయని.. అనియంత్రిత కార్యనిర్వాహక అధికారంపై నియంత్రణలు, సమతుల్యతలను నిర్ధారించాల్సిన రాజ్యాంగ సంస్థలు నాశనం చేయబడుతున్నాయనే రెండు అభిప్రాయాలు లేవు. నేను చారిత్రక సంఘటనకు హాజరు కావాలనుకుంటున్నాను. అదే రోజు నాగాలాండ్‌లో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు నేను హాజరుకావాల్సిన అవసరం ఉంది. కాబట్టి.. జోడో యాత్ర ముగింపు సభకు రాలేను. ఇందుకు నేను చింతిస్తున్నాను’’ అంటూ ఆ లేఖలో రాజీవ్ రంజన్ సింగ్ పేర్కొంది. ఒకరకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఎందుకంటే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఐక్యమవ్వాలని అనుకున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు కాంగ్రెస్ ఆహ్వానాన్ని జేడీయూ తిరస్కరించడం.. ఆ రెండు పార్టీల మధ్య అభిప్రాయబేధాలకు తావిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Botsa satyanarayana: పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు