Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
  • రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక సమావేశం
  • మర్యాదపూర్వకంగా కలిసినట్లు పోస్ట్
Nitin Nabin

Nitin Nabin

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్ మర్యాదపూర్వకంగా రాష్ట్రపతిని కలిసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నితిన్ నబిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘‘ఈరోజు నేను గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని మర్యాదపూర్వకంగా కలిశాను.
ఆయన సౌమ్య స్వభావం, దేశానికి చేసిన అచంచలమైన సేవ మనకు ఎంతో నేర్పుతాయి. ఆయన మార్గదర్శనం మన దేశం, సమాజం యొక్క ఉన్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేయడానికి మనకు నూతన శక్తిని, స్ఫూర్తిని ఇస్తుంది.’’ అని నితిన్ నబిన్ రాసుకొచ్చారు.