NTV Telugu Site icon

Nitin Gadkari: కాంగ్రెస్ చేసిన తప్పుల్ని మనం చేయకూడదు.. బీజేపీకి నితిన్ గడ్కరీ హెచ్చరిక..

Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: అధికారం కోసం కాంగ్రెస్ చేసిన తప్పిదాలనే మళ్లీ బీజేపీ చేయడంపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ సొంత పార్టీని హెచ్చరించారు. బీజేపీ ఒక భిన్నత్వ ఉన్న పార్టీ అని ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన శుక్రవారం ప్రస్తావించారు. ఈ గుర్తింపు కారణంగానే బీజేపీ స్థిరంగా ఓటర్ల విశ్వాసాన్ని పొందిందని గడ్కరీ చెప్పారు. గోవాలో జరిగిన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ..‘‘ కాంగ్రెస్ చేసిన పనిని మనం కొనసాగిస్తే, వారు నిష్క్రమించడం మనం ప్రవేశించడం వల్ల ప్రయోజనం ఉండదు’’ అని ఆయన అన్నారు.

Read Also: Anant Ambani Wedding LIVE: అంబానీ పెళ్లిలో తెలుగు హీరోల సందడి(వీడియో)

లోక్‌సభ ఎన్నికల్లో సొంతగా బీజేపీ మెజారిటీ సాధించడంలో విఫలమైన నెల రోజుల తర్వాత గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సదానంద్ తనవాడే, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హాజరైన గోవా బీజేపీ కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి తన గురువు, మాజీ ఉప ప్రధాని ఎక్‌కే అద్వానీ చేసిన ప్రకటనను ప్రస్తావించి, తేడాను వివరించారు. ‘‘ మనది భిన్నత్వం ఉన్న పార్టీ అని అద్వానీ జీ చెప్పేవారు. ఇతర పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామో అర్థం చేసుకోవాలి’’ అని గడ్కరీ అన్నారు. కాంగ్రెస్ తప్పుల వల్లే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారని చెప్పారు.

మళ్లీ అదే తప్పులను మనం చేస్తే, వారు రాజకీయాల్లో వారు వెళ్లిపోవడం, మనం రావడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. రాజకీయాలు సామాజిక మరియు ఆర్థిక సంస్కరణలను తీసుకురావడానికి ఒక సాధనం అని పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాలని సూచించారు. “అవినీతి రహిత దేశం” సృష్టించడానికి పార్టీకి సరైన ప్రణాళిక తీసుకురావాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయడకూడదని గడ్కరీ చెప్పారు. తాను ఇలాంటి ధోరణిని అనుసరించకూడదని నిర్ణయించుకున్నానని, నేను కుల రాజకీయాలు చేయనని చెప్పారు.