NTV Telugu Site icon

Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకాన్ని ప్రకటించిన గడ్కరీ

Nitin Gadkari

Nitin Gadkari

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స కోసం నితిన్ గడ్కరీ పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత… బాధితులకు గరిష్టంగా రూ. 1.5 లక్షల చికిత్స ఖర్చు తక్షణమే అందజేస్తుందని గడ్కరీ చెప్పారు. మంగళవారం నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త పథకం వివరాలు వెల్లడించారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే.. మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేయనున్నారు.

“ఈ నగదు రహిత ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాం. పథకంలో కొన్ని బలహీనతలను గమనించాం. మేము వాటిని మెరుగుపరుస్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది, ”అని న్యూఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో గడ్కరీ తెలిపారు. “మా మొదటి ప్రాధాన్యత రహదారి భద్రత. 2024లో రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోగా.. వారిలో 30 వేల మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోయారు. ప్రాణాంతక ప్రమాదాలకు గురైన వారిలో 66% మంది 18-34 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. స్కూళ్లు, కాలేజీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల తప్పుల వల్ల 10,000 మంది పిల్లలు చనిపోయారు” అని గడ్కరీ అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తుల వల్ల జరిగిన ప్రమాదాల్లో దాదాపు 3,000 మంది మరణించారని తెలిపారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని.. దాని కోసం కొత్త విధానాన్ని కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

Show comments