NTV Telugu Site icon

PM Modi: రాష్ట్రాల సహకారంతోనే వికసిత భారత్ 2047 సాధ్యం

Pmmodi

Pmmodi

రాష్ట్రాల సహకారంతోనే వికసిత భారత్ 2047 సాధ్యమని ప్రధాని మోడీ అన్నారు. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రులు సమావేశంలో వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Sundeep Kishan: ‘రాయన్’లో సందీప్ ఔటాఫ్ సిలబస్.. ఇప్పుడేం చేస్తాడు?

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అనేది ప్రతి భారతీయుడి ఆశయం అని చెప్పారు. అన్ని రాష్ట్రాల ఉమ్మడి కృషితో 2047 నాటికి వికసిత భారత్ కలను నెరవేర్చుకోగమని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్.. అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని ఆకాంక్షించారు. 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహమ్మారిని ఓడించామని చెప్పారు. ప్రజలు ఉత్సాహం.. విశ్వాసంతో నిండి ఉన్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Sai Dharam Tej: ఆ హీరోయిన్‌తో మెగా హీరో పెళ్లి ఫిక్స్?.. క్లారిటీ వచ్చేసింది

ఇదిలా ఉంటే ఈ సమావేశానికి ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డుమ్మా కొట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక ఎన్డీఏయేతర ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ సమావేశంలో మధ్యలోనే వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని మీడియా ముందు వాపోయారు. మాట్లాడుతుండగా తన మైక్ కట్ చేశారని మండిపడ్డారు. ఇక ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ గైర్హాజరయ్యారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ ఎందుకు హాజరు కాలేదన్నదే ఆసక్తిగా మారింది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Bengaluru: యువతి హత్య కేసులో నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!