NTV Telugu Site icon

Nita Ambani: కన్నీళ్లు తెప్పించిన నీతా అంబానీ స్పీచ్.. ఒక్కసారి ఉద్వేగంగా మారిన పెళ్లి వేదిక

Nitaambanispech

Nitaambanispech

అతిథులు.. బంధువులు.. స్నేహితులు.. అంతా పెళ్లి వేదికలో ఆసీనులయ్యారు. అప్పటి దాకా సంతోషంగా, ఉల్లాసంగా సాగిన పెళ్లి మండపం ఒక్కసారిగా సెలైంట్ అయిపోయింది. ఒక విధమైన ఉద్వేగ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి నీతా అంబానీ మాట్లాడిన మాటలు అందర్నీ ఆలోచనలో పడేసింది. కన్యాదానం గురించి హిందూ సాంప్రదాయాన్ని వివరిస్తూ ఉండగా అందరూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కొందరైతే కన్నీళ్లు పెట్టుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో నీతా అంబానీ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Pushpa 2 : సుకుమార్- బన్నీ మధ్య ఏం జరుగుతోంది?

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ జూలై 12న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా హాజరయ్యారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రంగాల సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే పెళ్లి సమయంలో అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ లేచి.. కన్యాదానం గురించి ప్రసంగించారు. దాని యొక్క విశిష్టతను సవివరంగా వివరించారు. హిందూ సంస్కృతిలో కుమార్తెల ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా వివరించారు. మహిళలు ప్రతి స్థల మందు గౌరవించబడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరి కళ్లు చమర్చాయి. కొందరైతే కన్నీళ్లు పెట్టుకున్నారు. స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, ఆమె గొప్పతనాన్ని చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పారు. అంతే నీతా ప్రసంగానికి అందరూ ముగ్ధులై.. చప్పట్లతో ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Show comments