NTV Telugu Site icon

Budget 2024: మంగళవారం నిర్మలమ్మ బడ్జెట్ విశేషాలు ఇవే!

Nirmalasitharaman

Nirmalasitharaman

మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సామవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే మంగళవారం మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఈ బడ్జెట్‌పై రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇక మిత్రపక్షాల రాష్ట్రాలైతే మరిన్ని ఆశలు పెట్టుకున్నాయి. కోట్లాది కళ్లన్నీ నిర్మలమ్మ బడ్జెట్‌పై ఫోకస్ అయి ఉన్నాయి. ఎలాంటి విశేషాలు ఉంటాయో మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

నిర్మలా సీతారామన్ షెడ్యూల్ ఇదే..
మంగళవారం ఉదయం 9 గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు నిర్మలా సీతారామన్ బయల్దేరి వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌కు చేరుకోనున్నారు. ఇక ఉదయం 10.15 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రధాని మోడీతో నిర్మలమ్మ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఉదయం 11 గంటలకు లోకసభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: DGP Dwaraka Tirumala Rao: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనపై డీజీపీ కీలక వ్యాఖ్యలు.. కుట్ర కోణం..!