NTV Telugu Site icon

Nirmala Sitaraman: కేసీఆర్‌పై నిర్మలా ఫైర్.. జోకులు వద్దంటూ వార్నింగ్

Nirmala On Kcr

Nirmala On Kcr

Nirmala Sitaraman Fires On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కి తెలియదని ఎద్దేవా చేశారు. ‘అమృతకాల బడ్జెట్‌’ అంశంపై హైదరాబాద్‌లో దూరదర్శన్‌ న్యూస్‌ ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌‌లకు చేరాలన్న లక్ష్యంపై జోక్‌లు వేయొద్దని సీరియస్ అయ్యారు. 2014లో తెలంగాణకు రూ.60 వేల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. తమపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నెంబర్లు చూసి విమర్శలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు.

Nitish Kumar: నాకు ప్రధాని కావాలనే కోరిక లేదు..

రాష్ట్రాలు చేసే అప్పులను నియంత్రించే బాధ్యత కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిందని, దానినే తాము అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాల పేర్లు అడిగినప్పుడు వాళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు బాధపడితే ఏం లాభమని నిర్మలా పేర్కొన్నారు. నో డేటా అవైలబుల్‌ గవర్నమెంట్‌ ఎవరిదో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందన్నారు. కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఉన్నప్పటికీ.. మెడికల్‌ కాలేజీల కోసం అవే జిల్లాల పేర్లు మళ్లీ పంపించారని, అందుకే తిరస్కరించి పంపించానన్నారు. అయితే.. ఇప్పటికీ కొత్త జిల్లాల పేర్లు పంపించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన డేటా ఇవ్వలేదని చెప్పారు. 2014 నుండి ఇప్పటివరకు 157 మెడికల్ కాలేజీలు స్థాపించామన్నారు. ఆ కాలేజీల వద్దే నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో ఉపాధి హామీకి కేటాయించిన దానికన్నా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Chandrababu Naidu: రాబోయే రోజుల్లో అసలు బటన్ జనం నొక్కుతారు

కాగా.. 2023-24 నాటికి మన ఎకనామీ 5 ట్రిలియన్స్‌కు చేరుతుందనడం పెద్దజోక్‌ అంటూ శాసనసభలో సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్‌ అని, మోదీ బడాయిలు పోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో 192 దేశాలుంటే.. అందులో తలసరి ఆదాయ ర్యాంకింగ్‌లో ఇండియాది 139వ స్థానమన్నారు. మనకంటే పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌ ముందున్నాయని విమర్శించారు. 2024లో బీజేపీ కుప్పకూలడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశంలో అంతులేని ప్రైవేటీకరణ జరుగుతోందని.. రైల్వేలు, ఎయిర్‌పోర్టులతో పాటు ఎల్‌ఐసీని ప్రైవేటుకు అప్పగిస్తున్నారని వాపోయారు.

Harish Rao: దేశం మార్పు కోసమే కేసీఆర్ పోరాడుతున్నారు