Nimisha Priya: యెమెన్ దేశంలో కేరళకు చెందిన నర్సు ఉరికంబం ఎక్కేందుకు సిద్ధమైంది. 2017లో ఆ దేశ జాగీయుడైన తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కారణంగా జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. 36 ఏళ్ల నిమిషాకు 2020లో అక్కడి న్యాయవ్యవస్థ మరణశిక్షను విధించింది. అయితే, నిమిషాను కాపాడేందుకు ససేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్ అధికారులు, యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇప్పుడున్న చివర ఆప్షన్ ఏంటంటే, నిమిషా ప్రియాను కాపాడేందుకు బాధితుడి కుటుంబాన్ని ‘‘బ్లడ్ మనీ’’కి ఒప్పించడమే. ఈ ఆఫర్ అంగీకరించేలా ఆ కుటుంబాన్ని యెమెన్‌కు చెందిన ప్రభావవంతమైన వ్యక్తుల సాయంతో ప్రయత్నిస్తున్నారు. మెహదీ కుటుంబానికి ఇచ్చిన ఆఫర్‌లలో, ఆ కుటుంబానికి 1 మిలియన్ డాలర్ల సాయం అందించడంతో పాటు, ఆ కుటుంబం సిఫారసు చేసిన వ్యక్తికి లేదా ఏ ఇతర వ్యక్తికైనా కేరళలో ఉచిత చికిత్స అందించడం, ఇందులో ప్రయాణ ఖర్చుల్ని కూడా భరించడం ఉంది. దీనికి తోడు మెహదీ సోదరుడు యూఏఈ, సౌదీ అరేబియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. నిమిషా ప్రియాను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేయాల్సిందంతా చేసినట్లు, సేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్ సభ్యులు చెప్పారు. అయితే, ఈ ఆఫర్‌పై మెహదీ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.
Read Also: AP Cabinet: 200 కంపెనీలకు వైసీపీ తప్పుడు ఇ-మెయిల్స్.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల!
2008లో ఉద్యోగం కోసం నిమిషా ప్రియా యెమెన్ వెళ్లింది. ఆ సమయం, మెహదీతో కలిసి స్థానికంగా 2015లో సొంత క్లినిక్ ప్రారంభించింది. అయితే, ఆ తర్వాత మెహదీ, నిమిషా పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని వేధించడం ప్రారంభించాడు. తన పాస్‌పోర్టు తిరిగిపొందేందుకు నిమిషా, మెహదీకి మత్తుమందు ఇచ్చింది. అయితే, డోస్ ఎక్కువ కావడంతో అతను చనిపోయాడు. యెమెన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడి అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. 2020లో ప్రియాకు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె కుటుంబం యెమెన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్‌ను 2023లో తోసిపుచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో, తిరుగుబాటుదారు హౌతీల సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు మహదీ అల్-మషత్ ఆమెకు ఉరిశిక్ష విధించారు. షరియా చట్టాల ప్రకారం, బాధిత కుటుంబం క్షమిస్తేనే ఉరిశిక్ష నుంచి తప్పించుకోగలరు.
