Suhas Shetty Murder Case: ఎన్ఐఏ చేతికి సుహాస్ శెట్టి హత్య కేసు..
- మాజీ భజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య కేసు ఎన్ఐఏ చేతికి..
- దక్షిణ కన్నడ జిల్లాలో సంచలనంగా మారిన మర్డర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suhas Shetty Murder Case: గత నెలలో కర్ణాటకలోని మంగళూర్లో మాజీ బజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య సంచలనం సృష్టించింది. ఈ హత్య తర్వాత కోస్తా కర్ణాటక ప్రాంతంతో తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయనుంది. 2022లో 23 ఏళ్ల మహమ్మద్ ఫాజిల్ అనే వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడైన శెట్టిని మే 1న కిన్నిపాడు సమీపంలో దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో స్థానిక పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు.
Read Also: Breaking : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
సుహాస్ హత్యను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉగ్రవాద నిరోధక సంస్థ అయిన ఎన్ఐఏ ఈ కేసులో నిందితులందర్ని ప్రశ్నిస్తుంది. ఐదు నుంచి ఆరుగురు నిందితులు సుహాస్ కారును అడ్డగించి అతడిపై మారణాయుధాలతో దాడి చేశారు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిన తర్వాత మరణించాడు.
శెట్టి హత్య దక్షిణ కన్నడ జిల్లా అంతటా విస్తృత అశాంతిని రేకెత్తించింది. పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేయడం, ప్రజా రవాణాను నిలిపివేశారు. హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ప్రతిపక్షాలు కోరాయి. 42 ఏళ్ల సుహాస్ శెట్టి కోస్తా కర్ణాటక ప్రాంతంలో సుపరిచిత వ్యక్తి. ఇతడికి బజరంగ్ దళ్ వంటి హిందుత్వ సంస్థలతో దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. అతనిపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ కూడా నమోదైంది. 2022లో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమైన ఫజిల్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా, సుల్లియాలో బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన తర్వాత కొన్ని రోజులకే ఫజిల్ హత్య జరిగింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!