Site icon NTV Telugu

Suhas Shetty Murder Case: ఎన్ఐఏ చేతికి సుహాస్ శెట్టి హత్య కేసు..

Suhas Shetty

Suhas Shetty

Suhas Shetty Murder Case: గత నెలలో కర్ణాటకలోని మంగళూర్‌లో మాజీ బజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య సంచలనం సృష్టించింది. ఈ హత్య తర్వాత కోస్తా కర్ణాటక ప్రాంతంతో తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయనుంది. 2022లో 23 ఏళ్ల మహమ్మద్ ఫాజిల్ అనే వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడైన శెట్టిని మే 1న కిన్నిపాడు సమీపంలో దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో స్థానిక పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు.

Read Also: Breaking : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు

సుహాస్ హత్యను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉగ్రవాద నిరోధక సంస్థ అయిన ఎన్ఐఏ ఈ కేసులో నిందితులందర్ని ప్రశ్నిస్తుంది. ఐదు నుంచి ఆరుగురు నిందితులు సుహాస్ కారును అడ్డగించి అతడిపై మారణాయుధాలతో దాడి చేశారు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిన తర్వాత మరణించాడు.

శెట్టి హత్య దక్షిణ కన్నడ జిల్లా అంతటా విస్తృత అశాంతిని రేకెత్తించింది. పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేయడం, ప్రజా రవాణాను నిలిపివేశారు. హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ప్రతిపక్షాలు కోరాయి. 42 ఏళ్ల సుహాస్ శెట్టి కోస్తా కర్ణాటక ప్రాంతంలో సుపరిచిత వ్యక్తి. ఇతడికి బజరంగ్ దళ్ వంటి హిందుత్వ సంస్థలతో దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. అతనిపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ కూడా నమోదైంది. 2022లో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమైన ఫజిల్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా, సుల్లియాలో బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన తర్వాత కొన్ని రోజులకే ఫజిల్ హత్య జరిగింది.

Exit mobile version