NTV Telugu Site icon

Tamil Nadu: తమిళనాడులో 22 చోట్ల ఎన్ఐఏ దాడులు.. ఎల్టీటీఈ పునరుద్ధరణకు మాఫియా ప్రయత్నం

Nia

Nia

NIA searches across Tamil Nadu: తమిళనాడు వ్యాప్తంతా 22 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఇటీవల శ్రీలంక నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై నమోదైన కేసుపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. డ్రగ్స్ మాఫియా, స్మగ్లర్లే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. తమిళనాడులోని చెన్నై. తిరుప్పూర్, చెంగల్పట్టు, తిరుచిరాపల్లి జిల్లాల్లోని నిందితులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. లంక డ్రగ్ మాఫియా సంబంధాల గట్టును కనుక్కునేందుకు ఎన్ఐఏ ఈ రైడ్స్ నిర్వహించింది.

లంక డ్రగ్ మాఫియాను సి. గుణశేఖరన్ అలియాస్ గుణ, పుష్ఫరాజా అలియాస్ పూకుట్టి కన్న నిర్వహిస్తున్నారని.. వీరికి పాకిస్తాన్ లోని డ్రగ్స్, ఆయుధాల సరఫరాదారుడు హాజీ సలీంతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. డ్రగ్స్, ఆయుధాలను అక్రమం రవాణా చేస్తున్నవారు శ్రీలంక, ఇండియాలో ఎల్టీటీఈ సంస్థ పునరుద్దరణ కోసం పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. నిందితులపై ఐపీసీ, యూఏపీఏ, ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎన్ఐఏ పేర్కొంది. గురువారం ఎన్ఐఏ చేసిన రైడ్స్ లో డిజిటల్ పరికరాలు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది.

Read Also: kaleshwaram project: కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేము.. తేల్చి చెప్పిన కేంద్రం

ఇదిలా ఉంటే బుధవారం ఎన్ఐఏ కాశ్మీర్ లోని తొమ్మిది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిమంది. శ్రీనగర్ తో పాటు పుల్వామాలో సోదాలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కుట్ర కేసులో ఎన్ఐఏ ఈ సోదాలు చేసింది. జూలై 18న కాశ్మీర్ పోలీసులు నమోదు చేసిన ఓ కేసును ఎన్ఐఏ తిరిగి విచారిస్తోంది. ఎన్ఐఏ నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 15 పిస్టల్స్, 30 మ్యాగజైన్స్, 300 రౌండ్ల బుల్లెట్లను, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకుంది.