Site icon NTV Telugu

NIA Raids: తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు..

Nia

Nia

NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. చెన్నై, మైలాడుతురై సహా 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఇందులో విదేశీ ఉగ్రవాద సంస్థలతో నిషేధిత ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తుంది.

Read Also: Daaku Maharaaj : డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

అయితే, 2019లో తంజావూరులోని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకె) నాయకుడు వీ. రామలింగం హత్య కేసు దర్యాప్తుతో తాజా ఆపరేషన్ ముడిపడి ఉన్నట్లు సమాచారం. అణగారిన వర్గాల ప్రజలను బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకించినందుకు 2019 ఫిబ్రవరి 5వ తేదీన రామలింగం దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి గతంలో ఎన్‌ఐఏ 18 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే, 2024 సెప్టెంబర్ 24న చెన్నై, కన్యాకుమారి, పుదుకోట్టైతో సహా తమిళనాడులోని 12 ప్రదేశాలలో ఎన్ఐఏ తనిఖీలు చేసింది. ఈ దాడులు నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ యొక్క రిక్రూట్‌మెంట్ కార్యకలాపాలకు గుర్తించింది. ఇందులో, ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని హిజ్బ్-ఉత్-తహ్రీర్ వ్యవస్థాపకుడు తకీ అల్-దిన్ అల్-నభానీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భావ జాలాన్ని స్వీకరించిన HUT కార్యకర్త, అజీజ్ అహ్మద్ 2024 ఆగస్టు 31న దేశం విడిచి పారిపోవడానికి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లగా అతడ్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.

Exit mobile version